రామ్ చరణ్ సినిమాలో తమన్న

రామ్ చరణ్, శంకర్ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని తీసుకున్న మేకర్స్, తాజాగా తమన్నను కూడా సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఆమె హీరోయిన్ కాదు, సెకెండ్ హీరోయిన్ కూడా కాదని తెలుస్తోంది. రామ్ చరణ్, శంకర్ సినిమాలో తమన్న, విలన్ కు భార్యగా కనిపించబోతోందట. సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా, ఎంతో విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి యూనిట్ నుంచి […]

Advertisement
Update:2021-08-16 15:40 IST

రామ్ చరణ్, శంకర్ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని తీసుకున్న మేకర్స్, తాజాగా తమన్నను కూడా సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే
ఇందులో ఆమె హీరోయిన్ కాదు, సెకెండ్ హీరోయిన్ కూడా కాదని తెలుస్తోంది.

రామ్ చరణ్, శంకర్ సినిమాలో తమన్న, విలన్ కు భార్యగా కనిపించబోతోందట. సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా, ఎంతో విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇంతకుముందు చరణ్-తమన్న కలిసి రచ్చ అనే సినిమా చేశారు. ఆ సినిమా పెద్ద హిట్టయింది. మళ్లీ
ఇన్నాళ్లకు చరణ్ సినిమాలో తమన్న కనిపించబోతోంది. మరోవైపు ఈ సినిమా లాంఛింగ్ కు సంబంధించి
కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వినాయకచవితికి ఈ సినిమాను ప్రారంభించే
ఆలోచనలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News