నయనతార హిట్.. సినిమా ఫట్

థియేటర్లలతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్న రోజులివి. అలా నయనతార నటించిన నెట్రికన్ సినిమా ఓటీటీలో డైరక్టర్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. నయనతార తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించినప్పటికీ, దర్శకుడి ఛాదస్తం వల్ల సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సరిగ్గా ఇక్కడే ఓటీటీకి, థియేటర్ కు తేడా చెబుతున్నారు నెటిజన్లు. ఓటీటీలో ఓ సినిమాను చూడాలనుకుంటే అది పక్కా స్క్రీన్ ప్లేతో ఉండాలి. ఎక్కడా సన్నివేశాలు సాగదీస్తున్నట్టు […]

Advertisement
Update:2021-08-15 16:09 IST

థియేటర్లలతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్న రోజులివి. అలా నయనతార నటించిన
నెట్రికన్ సినిమా ఓటీటీలో డైరక్టర్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
నయనతార తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించినప్పటికీ, దర్శకుడి ఛాదస్తం వల్ల సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

సరిగ్గా ఇక్కడే ఓటీటీకి, థియేటర్ కు తేడా చెబుతున్నారు నెటిజన్లు. ఓటీటీలో ఓ సినిమాను చూడాలనుకుంటే అది పక్కా స్క్రీన్ ప్లేతో ఉండాలి. ఎక్కడా సన్నివేశాలు సాగదీస్తున్నట్టు అనిపించకూడదు, బోర్ కొట్టిన ఫీలింగ్ రాకూడదు. థియేటర్లలో ఇలాంటి సన్నివేశాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ క్లైమాక్స్ కు వచ్చేసరికి అవన్నీ కవర్ అయిపోతాయి. ఓటీటీకి మాత్రం ఇది అస్సలు నడవదు. నెట్రికన్ సినిమాకు అదే మైనస్ అయింది.

ఈ సినిమా సెకెండాఫ్ సాగదీసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు మిలింద్ రావు కొన్ని సన్నివేశాల్ని అదే పనిగా డీటెయిలింగ్ గా చూపించడం సినిమాను దెబ్బకొట్టింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు సెకెండాఫ్ మైనస్ అంటున్నారు. మరోవైపు నయనతార పెర్ఫార్మెన్స్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. అంధురాలిగా ఆమె నటన నభూతో అంటున్నారు. దీంతో రివ్యూల్లో ఈ సినిమా మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. కానీ సెకెండాఫ్ వీక్ అవ్వడంతో.. ఓటీటీ ఆడియన్స్ నుంచి పెదవి విరుపులు తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News