అనిరుధ్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్

ఎట్టకేలకు ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ లాక్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. నిజానికి ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ చాన్నాళ్ల కిందటే తెరపైకి రావాల్సి ఉంది. అరవింద సమేత సినిమాకు అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఓపెనింగ్ కు కూడా అనిరుధ్ వచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో అతడి స్థానంలో తమన్ ను తీసుకున్నారు. అలా ఎన్టీఆర్ సినిమాకు సంగీతం […]

Advertisement
Update:2021-08-14 07:19 IST

ఎట్టకేలకు ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ లాక్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

నిజానికి ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ చాన్నాళ్ల కిందటే తెరపైకి రావాల్సి ఉంది. అరవింద సమేత సినిమాకు అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఓపెనింగ్ కు కూడా అనిరుధ్ వచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో అతడి స్థానంలో తమన్ ను తీసుకున్నారు.

అలా ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించే అవకాశం మిస్ చేసుకున్న అనిరుధ్, ఇన్నాళ్లకు మళ్లీ ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమా కోసం అనిరుధ్ నాలుగున్నర కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడనే టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే తారక్-కొరటాల సినిమా సెట్స్ పైకి వస్తుంది.

Tags:    
Advertisement

Similar News