డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చిందంట
ఏ హీరోయిన్ అయినా ఈ మాట అనొచ్చు. తను డబ్బు కోసమే సినిమా ఫీల్డ్ లోకి వచ్చానని చెప్పడంలో తప్పు లేదు. కానీ మహానటుడు, జాతీయ అవార్డు గ్రహీత కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఈ మాట చెప్పడం మాత్రం తప్పు. సినిమా అనేది ఓ కళ. దానికి ఎంత విలువ ఉందో కమల్ హాసన్ ను అడిగితే చెబుతారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన శృతిహాసన్ మాత్రం తను సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే వచ్చానని […]
ఏ హీరోయిన్ అయినా ఈ మాట అనొచ్చు. తను డబ్బు కోసమే సినిమా ఫీల్డ్ లోకి వచ్చానని చెప్పడంలో తప్పు లేదు. కానీ మహానటుడు, జాతీయ అవార్డు గ్రహీత కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఈ మాట చెప్పడం మాత్రం తప్పు. సినిమా అనేది ఓ కళ. దానికి ఎంత విలువ ఉందో కమల్ హాసన్ ను అడిగితే చెబుతారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన శృతిహాసన్ మాత్రం తను సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే వచ్చానని ఓపెన్ గా ప్రకటించింది.
సినిమాల్లోకి రాకముందే ఓ రాక్ బ్యాండ్ స్థాపించింది శృతిహాసన్. దాని ఖర్చులకు, సామగ్రి కొనుగోలుకు డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం సినిమా చేయాలని అనుకుందట శృతి. ఒక్క సినిమా చేసి డబ్బు సంపాదించి, ఇక ఆ తర్వాత మ్యూజిక్ బ్యాండ్ తో సెటిల్ అయిపోవాలని అనుకుందట. కానీ ఆమె ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచింది.
ఎప్పుడైతే ముఖానికి రంగేసుకుందో, ఎప్పుడైతే కెమెరా ముందుకొచ్చిందో.. అప్పుడే సినిమాతో ప్రేమలో
పడిపోయిందట శృతిహాసన్. ఇక ఫీల్డ్ ను వదల్లేకపోయిందట. అలా అప్పట్నుంచి ఇప్పటివరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నానని, భవిష్యత్తులో కూడా నటిస్తానని చెబుతోంది. అయితే సినిమాలు చేస్తున్నప్పటికీ, మ్యూజిక్ బ్యాండ్ ను మాత్రం కొనసాగిస్తానని అంటోంది.