డబ్బింగ్ స్టార్ట్ చేసిన నిఖిల్

ఓవైపు థియేటర్లలో సందడి కనిపిస్తోంది. మరోవైపు చిన్న సినిమాలన్నీ చకచక రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇంకోవైపు పెద్ద సినిమాలన్నీ సెట్స్ పైకి వచ్చేశాయి. అయితే అందర్లో ఒక భయం మాత్రం ఉంది. అదే థర్డ్ వేవ్. మూడోసారి కరోనా విజృంభిస్తే పరిస్థితేంటనే భయం అందర్లో ఉంది. అందుకే వీలైనంత త్వరగా తమ సినిమా పనులు పూర్తిచేయాలని అంతా తొందరపడుతున్నారు. 18 పేజెస్ యూనిట్ కూడా ఇదే తొందర్లో ఉంది. అందుకే చకచకా షూటింగ్ చేయడంతో పాటు మరోవైపు సైమల్టేనియస్ గా […]

Advertisement
Update:2021-08-13 09:22 IST

ఓవైపు థియేటర్లలో సందడి కనిపిస్తోంది. మరోవైపు చిన్న సినిమాలన్నీ చకచక రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇంకోవైపు పెద్ద సినిమాలన్నీ సెట్స్ పైకి వచ్చేశాయి. అయితే అందర్లో ఒక భయం మాత్రం ఉంది. అదే థర్డ్ వేవ్. మూడోసారి కరోనా విజృంభిస్తే పరిస్థితేంటనే భయం అందర్లో ఉంది. అందుకే వీలైనంత త్వరగా తమ సినిమా పనులు పూర్తిచేయాలని అంతా తొందరపడుతున్నారు.

18 పేజెస్ యూనిట్ కూడా ఇదే తొందర్లో ఉంది. అందుకే చకచకా షూటింగ్ చేయడంతో పాటు మరోవైపు
సైమల్టేనియస్ గా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసింది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వయంగా హీరో నిఖిల్ ఈ సినిమా డబ్బింగ్ పనులు
మొదలుపెట్టాడు.

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు
అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి
సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే
అందించడం విశేషం.

Tags:    
Advertisement

Similar News