ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారంలానే ఈ వీకెండ్ కూడా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ వారం ఏకంగా 9 సినిమాలు క్యూ కట్టడం విశేషం. వీటిలో సుందరి, పాగల్ సినిమాలపై మాత్రమే ఓ మోస్తరు అంచనాలున్నాయి. మిగతా సినిమాలు వేటిపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. విశ్వక్ సేన్, నివేత పెతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పాగల్. ఈ మూవీకి గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ అయితే ఓ రేంజ్ లో మీడియాను […]

Advertisement
Update:2021-08-12 13:42 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారంలానే ఈ వీకెండ్ కూడా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ వారం ఏకంగా 9 సినిమాలు క్యూ కట్టడం విశేషం. వీటిలో సుందరి, పాగల్ సినిమాలపై మాత్రమే ఓ మోస్తరు
అంచనాలున్నాయి. మిగతా సినిమాలు వేటిపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు.

విశ్వక్ సేన్, నివేత పెతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పాగల్. ఈ మూవీకి గ్రాండ్ గా ప్రమోషన్
చేస్తున్నారు. విశ్వక్ సేన్ అయితే ఓ రేంజ్ లో మీడియాను చుట్టేస్తున్నాడు. హాట్ హాట్ స్టేట్ మెంట్స్
ఇస్తున్నాడు. తాజాగా రిలీజైన ట్రయిలర్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు
పెరిగాయి.

ఇక పూర్ణ లీడ్ రోల్ చేసిన సుందరి సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఫిమేల్ ఓరియంటెడ్
సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఈ సినిమా ట్రయిలర్ లో అక్కడక్కడ బోల్డ్ కంటెంట్ ఉంది. కాబట్టి సినిమా హాట్ గా ఉంటుందని కుర్రకారు ఆశిస్తోంది. మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని హైలెట్ చేయడం లేదు.

ఈ సినిమాలతో పాటు రైతన్న, బ్రాందీ డైరీస్, సలామ్ నమస్తే, చైతన్యం, రావే నా చెలియా, ది కంజురింగ్ 3, ఒరేయ్ బామ్మర్ది సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News