ఆర్ఆర్ఆర్ పై మళ్లీ అనుమానాలు
అధికారికంగా తేదీ ప్రకటించారు. అక్టోబర్ 13న థియేటర్లలోకి వస్తామని పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ విడుదలపై అనుమానాలు మాత్రం పోవడం లేదు. మేకర్స్ ఎంత క్లారిటీ ఇస్తున్నప్పటికీ ట్రేడ్ మాత్రం నమ్మడం లేదు. ఇంతకీ ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై ఎందుకంత అనుమానం? ఈ సినిమా విడుదలపై అనుమానాలకు ఒకే ఒక్క కారణం. ఆర్ఆర్ఆర్ అనేది పాన్ ఇండియా సినిమా. ఒకేసారి 5 భాషల్లో విడుదల చేయాల్సిన సినిమా. కానీ బాలీవుడ్ లో పరిస్థితి బాగాలేదు. థియేటర్లు తెరుచుకోలేదు. మరో […]
అధికారికంగా తేదీ ప్రకటించారు. అక్టోబర్ 13న థియేటర్లలోకి వస్తామని పదే పదే చెబుతున్నారు.
అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ విడుదలపై అనుమానాలు మాత్రం పోవడం లేదు. మేకర్స్ ఎంత క్లారిటీ
ఇస్తున్నప్పటికీ ట్రేడ్ మాత్రం నమ్మడం లేదు. ఇంతకీ ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై ఎందుకంత అనుమానం?
ఈ సినిమా విడుదలపై అనుమానాలకు ఒకే ఒక్క కారణం. ఆర్ఆర్ఆర్ అనేది పాన్ ఇండియా సినిమా. ఒకేసారి 5 భాషల్లో విడుదల చేయాల్సిన సినిమా. కానీ బాలీవుడ్ లో పరిస్థితి బాగాలేదు. థియేటర్లు తెరుచుకోలేదు. మరో 2 నెలలు తెరుస్తారనే గ్యారెంటీ కూడా లేదు. మహారాష్ట్రలో పూర్తిగా హాల్స్ బంద్ ఉంది. బిహార్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా రెస్పాన్స్ అరకొరగానే ఉంది. ఇటు బెంగళూరులో కూడా థియేటర్ల వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తారా అనేది అందరి అనుమానం.
మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ లో జాప్యం వల్ల విడుదల ఉండదని అంతా అనుకున్నారు. కానీ
రాజమౌళి చకచకా సినిమా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతం యూనిట్ అంతా ఉక్రెయిన్ లో ఉంది. ఈ షెడ్యూల్ తో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. రిలీజ్ కు ఎలాంటి ఢోకా లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితుల వల్ల మూవీ రిలీజ్ పై అనుమానాలు ఎక్కువయ్యాయి.