ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన రాజశేఖర్

సీనియర్ హీరో రాజశేఖర్ ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చారు. తాజాగా ఆయన అంగీకరించిన శేఖర్ అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు రాజశేఖర్. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రమిది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. పైగా రాజశేఖర్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో సినిమా చాన్నాళ్లుగా ఆగిపోయింది. అలా ఆగిపోయిన ఈ మూవీ ఈరోజు మళ్లీ మొదలైంది. […]

Advertisement
Update:2021-08-11 12:26 IST

సీనియర్ హీరో రాజశేఖర్ ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చారు. తాజాగా ఆయన అంగీకరించిన శేఖర్ అనే సినిమా
షూటింగ్ స్టార్ట్ చేశారు రాజశేఖర్. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రమిది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. పైగా రాజశేఖర్ కూడా కరోనా బారిన
పడ్డారు. దీంతో సినిమా చాన్నాళ్లుగా ఆగిపోయింది. అలా ఆగిపోయిన ఈ మూవీ ఈరోజు మళ్లీ మొదలైంది.
అరకులో చిత్రీకరణ పునఃప్రారంభించారు. తాజా షెడ్యూల్ లో.. హీరో రాజశేఖర్ తో పాటు హీరోయిన్ అను
సితార, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారు. కీలక సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్ లోనే తీయబోతున్నారు.
రాజశేఖర్ సరసన మరో హీరోయిన్ గా ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని నటిస్తోంది.

ఇప్పుడు ప్రారంభమైన ఈ అరకు షెడ్యూల్ తో 75 శాతం సినిమా పూర్తవుతుంది. సుమారు 20 రోజుల పాటు, నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ లో 5 రోజులు షూటింగ్ చేశాక… శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ లో వారం రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది.

Tags:    
Advertisement

Similar News