నివేత పెతురాజ్ ఏడ్చిన సందర్భం

కొన్ని కథలు తెరపై చూసినప్పుడు మాత్రమే కాదు, కథ విన్నప్పుడు కూడా కదిలిస్తాయి. పాగల్ సినిమా కథ అలాంటిదే అంటోంది హీరోయిన్ నివేత పెతురాజ్. ఈ సినిమా కథను దర్శకుడు నెరేట్ చేసినప్పుడు చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది. “డైరెక్ట‌ర్ న‌రేశ్‌ ఈ స్క్రిప్ట్‌ను 5 సార్లు నెరేట్ చేశారు. స్క్రిప్ట్ నెరేష‌న్ టైమ్‌లోనే కొన్ని చోట్ల నేను ఏడ్చాను. తొలిసారే కాదు.. స్క్రిప్ట్ విన్న‌ప్పుడంతా ఆ ఎమోష‌నల్ సీన్స్‌కు క‌న్నీళ్లొచ్చాయి. రీసెంట్‌గా సినిమాను చూసిన‌ప్పుడు ఆ ఎమోష‌న‌ల్ సీన్స్‌లో […]

Advertisement
Update:2021-08-10 11:44 IST

కొన్ని కథలు తెరపై చూసినప్పుడు మాత్రమే కాదు, కథ విన్నప్పుడు కూడా కదిలిస్తాయి. పాగల్ సినిమా కథ
అలాంటిదే అంటోంది హీరోయిన్ నివేత పెతురాజ్. ఈ సినిమా కథను దర్శకుడు నెరేట్ చేసినప్పుడు చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది.

“డైరెక్ట‌ర్ న‌రేశ్‌ ఈ స్క్రిప్ట్‌ను 5 సార్లు నెరేట్ చేశారు. స్క్రిప్ట్ నెరేష‌న్ టైమ్‌లోనే కొన్ని చోట్ల నేను ఏడ్చాను.
తొలిసారే కాదు.. స్క్రిప్ట్ విన్న‌ప్పుడంతా ఆ ఎమోష‌నల్ సీన్స్‌కు క‌న్నీళ్లొచ్చాయి. రీసెంట్‌గా సినిమాను
చూసిన‌ప్పుడు ఆ ఎమోష‌న‌ల్ సీన్స్‌లో కన్నీళ్లొచ్చాయి. న‌టీన‌టులంద‌రూ చాలా గొప్ప‌గా న‌టించారు.”

ఇలా పాగల్ సినిమాను పొగిడేసింది ఈ బ్యూటీ. ప్రేమలో పడిన వాళ్లకు పాగల్ సినిమాలో డెప్త్
అర్థమౌతుందంటున్న నివేత.. సినిమాలో తన పాత్ర పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో కూడా
వివరించింది.

“ప్రేమ‌లో ఉన్న‌వారంద‌రూ పాగ‌ల్‌ సినిమాకు క‌నెక్ట్ అవుతారు. ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే ద‌ర్శ‌కుడెంత
పాగ‌ల్‌లా ప్యాష‌న్‌తో ఆలోచించి ఉంటాడో రేపు సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. పాగ‌ల్‌ సినిమాలో నా పాత్ర
పేరు తీర‌… ముందుగా నా క్యారెక్ట‌ర్‌కు గీత అని పేరు పెట్టారు. అయితే అందులో ఫీల్ లేద‌నిపించింది.
అందుక‌ని బాగా ఆలోచించి సెట్స్‌లోనే తీర అని క్యారెక్ట‌ర్‌కు పేరు మార్చారు.”

ఈనెల 14న థియేటర్లలోకి వస్తోంది పాగల్ మూవీ. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు
సమర్పిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News