పూజా హెగ్డే.. మరోసారి మహేష్ సరసన!
ఇప్పటికే ఈ హీరోహీరోయిన్లు ఇద్దరూ కలిసి మహర్షి అనే సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలోనే మహేష్ చేయబోయే సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటు పూజా హెగ్డే, అటు హారిక-హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్థారించాయి. త్వరలోనే సెట్స్ పైకి ఆమె రాబోతోంది. త్రివిక్రమ్-పూజా హెగ్డేకు ఇది హ్యాట్రిక్ మూవీ కాబోతోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో పూజా హెగ్డే నటించింది. ఇప్పుడు ముచ్చటగా […]
ఇప్పటికే ఈ హీరోహీరోయిన్లు ఇద్దరూ కలిసి మహర్షి అనే సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలోనే మహేష్ చేయబోయే సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటు పూజా హెగ్డే, అటు హారిక-హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్థారించాయి. త్వరలోనే సెట్స్ పైకి ఆమె రాబోతోంది.
త్రివిక్రమ్-పూజా హెగ్డేకు ఇది హ్యాట్రిక్ మూవీ కాబోతోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన
అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో పూజా హెగ్డే నటించింది. ఇప్పుడు ముచ్చటగా మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే కనిపించబోతోంది.
ప్రస్తుతం సర్కారువారిపాట సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఆ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే
త్రివిక్రమ్ తో సినిమా మొదలవుతుంది. ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. మహేష్ కు
బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు తమన్.