బాలయ్య నుంచి తప్పించుకున్న శృతి
క్రేజ్ లో ఉన్న హీరోయిన్లు బాలయ్య సరసన ఎందుకు నటించరు? సమంత, రష్మిక, తమన్న, రాశిఖన్నా, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మలు బాలయ్య సినిమాలకు ఎందుకు ఓకే చెప్పరు? పాతిక లక్షలు ఎక్స్ ట్రా ఇస్తామన్నా కూడా ఎందుకు నో చెబుతుంటారు..? అదంతే.. కొన్నింటికి సమాధానాలు ఉండవు. అలా జరిగిపోతుంటాయంతే. అందుకే బాలయ్య తనకు అందుబాటులో ఉన్న హీరోయిన్లతో పని కానిచ్చేస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో బాలయ్య సినిమాలో శృతిహాసన్ అంటూ ప్రచారం మొదలైంది. గోపీచంద్ మలినేని […]
క్రేజ్ లో ఉన్న హీరోయిన్లు బాలయ్య సరసన ఎందుకు నటించరు? సమంత, రష్మిక, తమన్న, రాశిఖన్నా,
పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మలు బాలయ్య సినిమాలకు ఎందుకు ఓకే చెప్పరు? పాతిక లక్షలు ఎక్స్ ట్రా
ఇస్తామన్నా కూడా ఎందుకు నో చెబుతుంటారు..? అదంతే.. కొన్నింటికి సమాధానాలు ఉండవు. అలా
జరిగిపోతుంటాయంతే. అందుకే బాలయ్య తనకు అందుబాటులో ఉన్న హీరోయిన్లతో పని కానిచ్చేస్తుంటాడు.
ఇలాంటి టైమ్ లో బాలయ్య సినిమాలో శృతిహాసన్ అంటూ ప్రచారం మొదలైంది. గోపీచంద్ మలినేని
దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో శృతిని తీసుకున్నారంటూ పుకార్లు వ్యాపించింది. ఇంతకుముందు
మలినేని దర్శకత్వంలో బలుపు, క్రాక్ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కాబట్టి బాలయ్య సరసన శృతి ఫిక్స్
అనుకున్నారంతా.
కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు శృతిహాసన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయింది. కాస్త ఎక్కువ
రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ.. శృతిహాసన్ ఈ సినిమా చేయడానికి మొండికేసినట్టు
తెలుస్తోంది. అయితే పూర్తిగా సినిమా నుంచి తప్పుకోకుండా ఓ చిన్న గెస్ట్ రోల్ మాత్రం చేస్తానని దర్శకుడికి హామీ ఇచ్చిందట.