డిప్యూటీ సీఎంలు లేరు.. యడ్యూరప్ప ఆశలు గల్లంతు..

కర్నాటక బీజేపీలో యడ్యూరప్ప శకం ముగిసింది. మంత్రి వర్గ కూర్పు తొలిరోజే.. కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన మార్కు చూపించారు. డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేవీ లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. ఇకపై పార్టీ కి ఒకే ఫేస్ ఉంటుంది, అది బొమ్మై మాత్రమే అనేలా కర్నాటకలో పొలిటికల్ సీన్ మలుపు తిరిగింది. జంబో మంత్రి వర్గం కాదు, డిప్యూటీలు లేరు.. కర్నాటకలో మొత్తం 34 మందికి మంత్రులయ్యే అవకాశం ఉన్నా కూడా.. కేవలం 29మందితోనే […]

Advertisement
Update:2021-08-05 03:26 IST

కర్నాటక బీజేపీలో యడ్యూరప్ప శకం ముగిసింది. మంత్రి వర్గ కూర్పు తొలిరోజే.. కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన మార్కు చూపించారు. డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేవీ లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. ఇకపై పార్టీ కి ఒకే ఫేస్ ఉంటుంది, అది బొమ్మై మాత్రమే అనేలా కర్నాటకలో పొలిటికల్ సీన్ మలుపు తిరిగింది.

జంబో మంత్రి వర్గం కాదు, డిప్యూటీలు లేరు..
కర్నాటకలో మొత్తం 34 మందికి మంత్రులయ్యే అవకాశం ఉన్నా కూడా.. కేవలం 29మందితోనే సరిపెట్టారు కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై. అంతే కాదు డిప్యూటీ సీఎంల విషయంలో కూడా ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. డిప్యూటీ సీఎంల రేస్ లో చాలామంది పేర్లు వినిపించినా, అసలా పోస్టే లేకుండా చేశారు. యడ్యూరప్ప మంత్రివర్గంలో పని చేసిన వారిలో ఏడుగురిని తొలగించారు. వీరిలో నలుగురు సీనియర్లున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ముందుగానే తాను బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో చేరనని ప్రకటించటంతో ఆయనకు చోటు దక్కలేదు.

యడ్యూరప్పకు షాకే..
యడ్డీ దిగిపోయినా కొత్త మంత్రి వర్గంపై ఆయన ముద్ర ఉంటుందని చాలామంది భావించారు. ఆయన కొడుకు విజయేంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని అనుకున్నారు. లేదా కనీసం మంత్రి పదవి అయినా ఇస్తారనే అంచనాలున్నాయి. ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ డిప్యూటీ సీఎం కాదు కదా, కనీసం మంత్రి వర్గంలో కూడా యడ్డీ తనయుడు విజయేంద్రకు అవకాశం ఇవ్వలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో ఆయన్ను పక్కనపెట్టారు. అంతే కాదు, యడ్డీ వర్గంగా చెప్పుకునే ఎవరికీ బసవరాజ్ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే, బీజేపీ హైకమాండ్ యడ్యూరప్ప, ఆయన తనయుడు విజయేంద్రతో మాట్లాడిందని, మంత్రి వర్గ కూర్పు అంతా హైకమాండ్ కనుసన్నల్లోనే జరిగిందని, తనకేమీ తెలియదంటూ తప్పించుకున్నారు బవసరాజ్ బొమ్మై. మొత్తమ్మీద తాజా విస్తరణతో కర్నాటకలో యడ్డీ శకం ముగిసిందని స్పష్టమైంది.

Tags:    
Advertisement

Similar News