ఒరేయ్ బామ్మర్ది ట్రయిలర్ రివ్యూ
సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శివప్పు మంజల్ పచ్చై’. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ‘ఒరేయ్ బామ్మర్ది’గా ఆగస్ట్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ.. వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే […]
సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు శశి
దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శివప్పు మంజల్ పచ్చై’. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పిళ్లై
నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ‘ఒరేయ్ బామ్మర్ది’గా ఆగస్ట్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ.. వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది.
డిపార్ట్‌మెంట్ లోపలైనా, బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. సో.. ఈ లోకంలో ఎవరితో ఒకరితోనైనా 200 శాతం హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ సిద్ధార్థ్ తన భార్య లిజోమోల్ జోస్‌తో చెప్పే ఓ లవ్ అండ్ ఎమోషనల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
‘మీ తమ్ముడు నన్ను ప్రేమిస్తున్నాడు.. నాకు వాడంటే బాగా ఇష్టం’ అని హీరోయిన్ కశ్మీరా పరదేశి .. జీవీ
ప్రకాశ్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని అతని అక్కయ్య లిజో మోల్‌కు చెబుతుంది. ‘నాకు చెప్పనే లేదే’ అని లిజోమోల్ అంటే.. ‘ఇంకా మేమే చెప్పుకోనే లేదు’ అంటూ కశ్మీరా పరదేశి సమాధానం చెబుతుంది. ప్రేమలో మరో కోణాన్ని ఎలివేట్ చేసే ఈ రెండు డైలాగ్స్‌కు మధ్య, సన్నివేశాలను చూపిస్తూ.. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్‌ల క్యారెక్టర్స్ గురించి దర్శకుడు శశి వివరించే ప్రయత్నం చేశారు.
తర్వాత సినిమా మెయిన్ కథాంశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. బైక్ రేసులంటూ తిరిగే యువకుడి
పాత్రలో జీవీ ప్రకాశ్ కనిపిస్తే.. నగరంలో రేసర్స్‌ను పట్టుకునే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సిద్ధార్థ్
కనిపించున్నారు. వీరిద్ధరి మధ్య ప్రొఫెషనల్‌గా..పర్సనల్‌గా ఉండే టచ్‌ను చూపిస్తూ సినిమా ఉంటుందనేది ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది.