ఇంద్రలోకం టు ఈస్ట్ గోదావరి
నాగార్జున ఖాతాలో ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న బంగార్రాజు సినిమా ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈనెల 20 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దీనికోసం అన్నపూర్ణ స్టుడియోలో భారీ ఇంద్రలోకం సెట్ వేశారు. తొలి షెడ్యూల్ ఆ సెట్ లోనే ఉంటుంది. నాగార్జున, రమ్యకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సెకెండ్ షెడ్యూల్ ను ఈస్ట్ గోదావరి జిల్లాలో కొనసాగించాలని నిర్ణయించారు. సెకెండ్ షెడ్యూల్ కు […]
నాగార్జున ఖాతాలో ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న బంగార్రాజు సినిమా ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈనెల 20 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దీనికోసం అన్నపూర్ణ
స్టుడియోలో భారీ ఇంద్రలోకం సెట్ వేశారు. తొలి షెడ్యూల్ ఆ సెట్ లోనే ఉంటుంది. నాగార్జున, రమ్యకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు.
ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సెకెండ్ షెడ్యూల్ ను ఈస్ట్ గోదావరి జిల్లాలో కొనసాగించాలని
నిర్ణయించారు. సెకెండ్ షెడ్యూల్ కు నాగచైతన్య, కృతి షెట్టి అందుబాటులోకి వచ్చేలా కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేశారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. గతంలో సూపర్ హిట్టయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ ఇది.
మరోవైపు ఈ సినిమా బిజినెస్ కూడా అప్పుడే పూర్తవ్వడం గమనార్హం. జీ గ్రూప్ సంస్థ.. బంగార్రాజు ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా చేరింది. అంటే.. అన్నపూర్ణ స్టుడియోస్, జీ స్టుడియోస్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుందన్నమాట. ఒప్పందంలో భాగంగా.. సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ జీ గ్రూప్ వశమయ్యాయి.