అప్పుడు అభిలాష.. ఇప్పుడు తిమ్మరుసు

రేపు థియేటర్లలోకి రాబోతోంది తిమ్మురుసు సినిమా. నటుడిగా ఈమధ్య కాలంలో బాగా క్లిక్ అయిన సత్యదేవ్ ఇందులో హీరో. ఈ సినిమా గురించి సత్యదేవ్ మాట్లాడాడు. మరీ ముఖ్యంగా గతంలో చిరంజీవి నటించిన అభిలాష సినిమాతో తిమ్మరుసును పోలుస్తున్నాడు. “నా పాత్ర అభిలాష‌ సినిమాలో చిరంజీవిగారిలా ఉంటుంది. ఆ క‌థ‌కు దీనికి చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది. అభిలాష చిత్రంలో చిరంజీవిగారు ఉరి శిక్ష ర‌ద్దు కోసం పోరాడితే, ఇందులో నా పాత్ర, యావ‌జ్జీవ కారాశిక్ష అనే పాయింట్‌పై ఫైట్ చేస్తుంది. న్యాయం […]

Advertisement
Update:2021-07-29 13:43 IST

రేపు థియేటర్లలోకి రాబోతోంది తిమ్మురుసు సినిమా. నటుడిగా ఈమధ్య కాలంలో బాగా క్లిక్ అయిన సత్యదేవ్ ఇందులో హీరో. ఈ సినిమా గురించి సత్యదేవ్ మాట్లాడాడు. మరీ ముఖ్యంగా గతంలో చిరంజీవి నటించిన అభిలాష సినిమాతో తిమ్మరుసును పోలుస్తున్నాడు.

“నా పాత్ర అభిలాష‌ సినిమాలో చిరంజీవిగారిలా ఉంటుంది. ఆ క‌థ‌కు దీనికి చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది.
అభిలాష చిత్రంలో చిరంజీవిగారు ఉరి శిక్ష ర‌ద్దు కోసం పోరాడితే, ఇందులో నా పాత్ర, యావ‌జ్జీవ కారాశిక్ష అనే పాయింట్‌పై ఫైట్ చేస్తుంది. న్యాయం కోసం ఎందాకైనా పోరాడే ఓ లాయ‌ర్ ఓ కేసులో చివ‌రి వ‌ర‌కు ఎలా నిల‌బ‌డ్డాడు. దానిలో ట్విస్టులు, ట‌ర్న్స్ ఏంటి? అనేదే తిమ్మ‌రుసు సినిమా. సినిమా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో టేకాఫ్ అవుతుంది. క్ర‌మంగా సీరియ‌స్ మోడ్‌లోకి క‌థ ర‌న్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.”

ప్రస్తుతం టాలీవుడ్ లో లాయర్ సెంటిమెంట్ నడుస్తోందంటున్నాడు సత్యదేవ్. వకీల్ సాబ్, నాంది ఎలాగైతే హిట్టయ్యాయో, తన తిమ్మరుసు కూడా అలానే హిట్ అవుతుందని చెబుతున్నాడు.

“సాధార‌ణంగా థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ సినిమా అంటే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో ఎక్కువ‌గా ఉంటాయి. లాయ‌ర్ కోణం
నుంచి సాగే థ్రిల్ల‌రే ఈ చిత్రం. ఉన్న డ‌బ్బుని కూడా ఖ‌ర్చు పెట్టి న్యాయం వైపు నిల‌బ‌డే లాయ‌ర్ సినిమా ఇది. ఇందులో కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. దీంతో పాటు యాక్ష‌న్ పార్ట్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌కీల్‌సాబ్‌, నాంది వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడాయి.. కాబ‌ట్టి మేం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.”

రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది తిమ్మరుసు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించాడు.

Tags:    
Advertisement

Similar News