మహాసముద్రం మోషన్ పోస్టర్ ఇదే

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహాసముద్రం’ కూడా ఒకటి. శర్వానంద్, సిద్దార్థ్‌ హీరోలుగా నటించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ మూవీని టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మహాసముద్రం సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఆసక్తికరమైన […]

Advertisement
Update:2021-07-29 13:41 IST

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహాసముద్రం’ కూడా
ఒకటి. శర్వానంద్, సిద్దార్థ్‌ హీరోలుగా నటించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ మూవీని టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

మహాసముద్రం సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా
జరుగుతున్నాయి. థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తున్న ‘మహాసముద్రం’లోని ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు
చేస్తున్నాయి. ఇక ఎగ్రెసివ్ గా కనిపిస్తున్న హీరోలు శర్వాందన్, సిద్దార్థ్‌ల లుక్స్, తాజా కొత్త పోస్టర్స్‌
అవుట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. సిద్దార్థ్‌ గన్‌ పట్టు కోవడం, శర్వానంద్ కోపోద్రోక్తుడై నడుచుకుంటూ రావడం
మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ ఈ చిత్రంలోని క్యారెక్టర్స్‌కు ఇచ్చిన
ఎలివేషన్స్‌ ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే అదిరిపోయేలా ఉంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మాం ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని
నిర్మిస్తున్నారు. అదితిరావు, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News