హీరో సుమంత్ కు మళ్లీ పెళ్లి?
ఇన్నాళ్లూ సింగిల్ గా ఉన్న హీరో సుమంత్.. ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అక్కినేని కుటుంబానికి బాగా దగ్గరైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సుమంత్ పెళ్లి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి ఓ పెళ్లి కార్డు ఫొటో కూడా రౌండ్స్ కొడుతోంది. సుమంత్ తొలి అక్షరం ఎస్, పవిత్ర తొలి అక్షరం పి. ఈ రెండు పదాల్ని కలిపి ఎస్పీ పేరిట వినూత్నంగా ఓ వెడ్డింగ్ కార్డు తయారుచేశారు. స్వయంగా […]
ఇన్నాళ్లూ సింగిల్ గా ఉన్న హీరో సుమంత్.. ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అక్కినేని కుటుంబానికి బాగా దగ్గరైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సుమంత్ పెళ్లి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి ఓ పెళ్లి కార్డు ఫొటో కూడా రౌండ్స్ కొడుతోంది.
సుమంత్ తొలి అక్షరం ఎస్, పవిత్ర తొలి అక్షరం పి. ఈ రెండు పదాల్ని కలిపి ఎస్పీ పేరిట వినూత్నంగా ఓ వెడ్డింగ్ కార్డు తయారుచేశారు. స్వయంగా సుమంత్, పవిత్ర కలిసి కొంతమంది ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా ఆ పెళ్లికార్డులిచ్చి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడనేది ఇంకా బయటకురాలేదు.
2004లో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు సుమంత్. అప్పటికే ఆమె పలు సినిమాల్లో నటించింది. అందగత్తెగా పేరు తెచ్చుకుంది. కానీ ఎందుకో, సుమంత్-కీర్తిరెడ్డిల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. పెళ్లయిన రెండేళ్లకే ఇద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి సింగిల్ గానే ఉన్న సుమంత్, ఎట్టకేలకు పవిత్రతో ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారట.