'అతడు' కాంబినేషన్ రిపీట్ అవుతుందా?

అతడు కాంబినేషన్ అనగానే ఎవరికైనా మహేష్-త్రివిక్రమ్ గుర్తొస్తారు. కానీ ఈ కాంబినేషన్ పేరు చెప్పగానే మహేష్-త్రిష్ కూడా గుర్తొస్తారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. అచ్చమైన బావమరదళ్లలా కనిపించారు. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసి చాన్నాళ్లయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో వార్తల్లో నిలిచింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం త్రిషను తీసుకుంటున్నారట. అయితే ఇది ఫస్ట్ హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. ఓ […]

Advertisement
Update:2021-07-25 06:35 IST

అతడు కాంబినేషన్ అనగానే ఎవరికైనా మహేష్-త్రివిక్రమ్ గుర్తొస్తారు. కానీ ఈ కాంబినేషన్ పేరు చెప్పగానే
మహేష్-త్రిష్ కూడా గుర్తొస్తారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. అచ్చమైన
బావమరదళ్లలా కనిపించారు. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసి చాన్నాళ్లయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో
వార్తల్లో నిలిచింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం త్రిషను
తీసుకుంటున్నారట. అయితే ఇది ఫస్ట్ హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. ఓ కీలక పాత్ర. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
లాంటిదేదో ప్లాన్ చేసి, అక్కడ మహేష్-త్రిషను కలపబోతున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతానికైతే ఇది గాసిప్
లెవెల్లోనే ఉంది. కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది చెప్పలేం.

ఎందుకంటే.. త్రిష చాలా సీనియర్ అయిపోయింది. రోజురోజుకు వయసు తగ్గించుకున్న మహేష్ లాంటి
హీరో పక్కన అలాంటి హీరోయిన్ ను ఫ్యాన్స్ అంగీకరిస్తారా అనేది చూడాలి. ఈ సంగతి పక్కనపెడితే..
ఇలాంటి కీలక పాత్రలకు (హీరోయిన్ రోల్స్ కాకుండా) త్రిష అంగీకరిస్తుందా అనేది కూడా అనుమానమే.
ఏదేమైనా మహేష్-త్రిష మరోసారి కలిస్తే బాగుంటుంది. తెరపై చూడ్డానికి అందంగా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News