లూసిఫర్ రీమేక్ అప్ డేట్స్

మోహన్ రాజా డైరెక్షన్ లో మళయాలం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఆగస్ట్ 13 నుండి సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జైలు సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ లో ముందుగా చిరంజీవిపై కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తారు. 13వ […]

Advertisement
Update:2021-07-24 12:05 IST

మోహన్ రాజా డైరెక్షన్ లో మళయాలం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి
తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఆగస్ట్
13 నుండి సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు మేకర్స్.

ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జైలు సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ లో
ముందుగా చిరంజీవిపై కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తారు. 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరుగుతుంది ఈ
షెడ్యూల్.

సినిమాకు మిగతా నటీనటుల ఎంపిక ఇంకా పూర్తిచేయాల్సి ఉంది. ముఖ్యంగా హీరోయిన్ , విలన్
పాత్రలకు ఇంకా ఆర్టిస్టులను సెలెక్ట్ చేయలేదు. ప్రస్తుతం దర్శకుడు అదే పనిలో ఉన్నాడు. హీరోయిన్ గా
నయనతార ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కి తమన్ సంగీతం
అందిస్తున్నాడు. ఈమధ్యే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా
తెరకెక్కనున్న ఈ సినిమాకు లక్ష్మీ భూపాల మాటలు అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News