పూరి జగన్నాధ్ అమ్మ ఈ హీరో ఫ్యాన్

పూరి జగన్నాధ్ అమ్మగారికి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా..? మహా అయితే చిరంజీవి లేదా బాలకృష్ణ ఇష్టం అనుకోవచ్చు. లేదంటే ఇప్పటి హీరోల్లో మహేష్ బాబు లేదా పవన్ కల్యాణ్ పేరు చెబుతారు. కానీ పూరి జగన్నాధ్ తల్లికి సత్యదేవ్ అంటే ఇష్టం. ఈ విషయాన్ని సత్యదేవ్ స్వయంగా బయటపెట్టాడు. “పూరి జగన్నాధ్ అమ్మ, పూరితో అంటుంటారట. ఆ అబ్బాయి (సత్యదేవ్)తో ఏదైనా మంచి సినిమా చేయి అని అడుగుతుంటారట. పూరి జగన్నాద్ మదర్ నాకు […]

Advertisement
Update:2021-07-23 11:55 IST

పూరి జగన్నాధ్ అమ్మగారికి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా..? మహా అయితే చిరంజీవి లేదా బాలకృష్ణ
ఇష్టం అనుకోవచ్చు. లేదంటే ఇప్పటి హీరోల్లో మహేష్ బాబు లేదా పవన్ కల్యాణ్ పేరు చెబుతారు. కానీ
పూరి జగన్నాధ్ తల్లికి సత్యదేవ్ అంటే ఇష్టం. ఈ విషయాన్ని సత్యదేవ్ స్వయంగా బయటపెట్టాడు.

“పూరి జగన్నాధ్ అమ్మ, పూరితో అంటుంటారట. ఆ అబ్బాయి (సత్యదేవ్)తో ఏదైనా మంచి సినిమా చేయి
అని అడుగుతుంటారట. పూరి జగన్నాద్ మదర్ నాకు పెద్ద ఫ్యాన్ అంట. ఈ విషయాన్ని పూరి నాకు
చెబుతుంటారు. బహుశా, భవిష్యత్తులో పూరి జగన్నాధ్ నాకు మరో ఛాన్స్ ఇస్తారేమో.”

ఇలా తన అతిపెద్ద అభిమాని మేటర్ ను బయటపెట్టాడు సత్యదేవ్. పూరితో మరో సినిమా చేయాల్సి వస్తే
బ్లఫ్ మాస్టర్ టైపులో అగ్రెసివ్ గా ఉండే పాత్ర చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు
సత్యదేవ్.

ఈ హీరో నటించిన తిమ్మరుసు సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా
నటించిన ఈ సినిమాలో లాయర్ రామచంద్ర పాత్రలో కనిపించబోతున్నాడు సత్యదేవ్.

Tags:    
Advertisement

Similar News