కరోనా కష్టాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్..

కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. కేంద్రం, పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచి ఖజానా నింపుకుంటోంది. ఇటు రాష్ట్రాల పరిస్థితి మాత్రం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా తయారైంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది. ఏడాదికి 6వేల కోట్ల రూపాయలు మిగులు చూపించే స్కీమ్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమైంది. దాని పేరు ఫుర్లో. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. అది కూడా పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్య విభాగాలు మినహా […]

Advertisement
Update:2021-07-23 02:31 IST

కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. కేంద్రం, పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచి ఖజానా నింపుకుంటోంది. ఇటు రాష్ట్రాల పరిస్థితి మాత్రం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా తయారైంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది. ఏడాదికి 6వేల కోట్ల రూపాయలు మిగులు చూపించే స్కీమ్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమైంది.

దాని పేరు ఫుర్లో. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. అది కూడా పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్య విభాగాలు మినహా మిగతా వారికి వర్తిస్తుంది. అత్యవసర సేవల కిందకు రాని మిగతా విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఫుర్లో పథకం కింద పెయిడ్ హాలిడే తీసుకోవచ్చు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు తమ ఇష్ట ప్రకారం ఉద్యోగానికి సెలవు పెట్టొచ్చు. అయితే ఇలా సెలవు పెట్టినా కూడా ప్రతి నెలా సగం జీతం ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. మిగతా సగం తాను మిగుల్చుకుంటుంది. వారు చేయాల్సిన పనిని మిగతా ఉద్యోగులతో, మరీ అవసరం అనుకుంటే తాత్కాలిక ఉద్యోగులతో పనిని సర్దుబాటు చేసుకుంటుంది. సెలవు తీసుకున్న తర్వాత ఉద్యోగులు ఇతర వ్యాపారాలు చేసుకోవచ్చు. తిరిగి ఉద్యోగంలో చేరడం, చేరకపోవడం వారి ఇష్టానికే వదిలేస్తోంది. అయితే సెలవురోజుల్లో మాత్రం ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్స్ లు ఉండవు. కేవలం సంగం జీతం ఇచ్చి సరిపెడతారు.

మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జగదీశ్ ఆధ్వర్యంలో ఫుర్లో పథకం పురుడుపోసుకుంది. ఆర్థిక శాఖ అధికారులు దీనికి తుదిరూపు తీసుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదముద్ర పడటం తరువాయి ఇది అమలులోకి వస్తుందని అంటున్నారు అధికారులు. ఇదేమీ కొత్త పథకం కాదని, గతంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో ఇలాంటి పథకాన్నే అమలులో పెట్టారని చెబుతున్నారు. అయితే అప్పట్లో ఆ స్కీమ్ ని ఏడాదిలోగా రద్దు చేశారు. ఇప్పుడు మాత్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెయిడ్ హాలిడేస్ విషయాన్ని సీరియస్ గా వర్కవుట్ చేస్తోంది. అమెరికా, యూకేల్లో కూడా ఇలాంటి స్కీమ్ లు ఉన్నాయని, అక్కడ ఉద్యోగులు మూడేళ్లు సెలవు తీసుకుని 70శాతం జీతాలు తీసుకుంటారని చెబుతున్నారు అధికారులు.

కష్టకాలంలో ఆస్తుల అమ్మకం..
కరోనా కష్టాల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఆస్తుల అమ్మకం ద్వారా 500కోట్ల రూపాయలు సమీకరించింది. 22 ప్రాంతాల్లో నిరర్థక ఆస్తుల్ని సర్కారు అమ్మేసింది. ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో మిగులుకోసం చూస్తోంది.

Tags:    
Advertisement

Similar News