తమిళనాడు వెళ్లిన అఖండ

అఖండ సినిమా కీలకమైన షెడ్యూల్ లోకి ఎంటరైంది. ఈ మూవీకి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ మొదలుపెట్టారు. తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో అఖండ క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది. హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో పాటు ఇతర కీలక నటీనటులతో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి సింహా, లెజెండ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు అఖండ వస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ […]

Advertisement
Update:2021-07-23 11:53 IST

అఖండ సినిమా కీలకమైన షెడ్యూల్ లోకి ఎంటరైంది. ఈ మూవీకి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్
మొదలుపెట్టారు. తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో అఖండ క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది.
హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో పాటు ఇతర కీలక నటీనటులతో ఈ సినిమా షూటింగ్
జరుగుతోంది.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి
సింహా, లెజెండ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు అఖండ వస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో స్టంట్ శివ
నేతృత్వంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ తో పాటు పూర్ణ ఓ కీలక
పాత్రలో కనిపించనుంది. జగపతిబాబు, శ్రీకాంత్ మరో 2 ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ
సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్
చేస్తారు.

Tags:    
Advertisement

Similar News