మరోసారి తీవ్రంగా గాయపడిన విశాల్
షూటింగ్ సమయంలో నటులు గాయపడ్డం కామన్ అయిపోయింది. ఒకప్పట్లా డూప్ సహాయంతో యాక్షన్ సీన్లు చేయడం లేదు ఇప్పటి హీరోలు. అందుకే తరచుగా గాయాల పాలవుతున్నారు. తాజాగా విశాల్ గాయపడ్డాడు. ఈసారి వెన్నెముకకు బలంగా గాయమవ్వడంతో అతడ్ని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. ఈ సినిమాకు నాట్ ఏ కామన్ మేన్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. విశాల్ […]
షూటింగ్ సమయంలో నటులు గాయపడ్డం కామన్ అయిపోయింది. ఒకప్పట్లా డూప్ సహాయంతో యాక్షన్
సీన్లు చేయడం లేదు ఇప్పటి హీరోలు. అందుకే తరచుగా గాయాల పాలవుతున్నారు. తాజాగా విశాల్
గాయపడ్డాడు. ఈసారి వెన్నెముకకు బలంగా గాయమవ్వడంతో అతడ్ని వెంటనే హాస్పిటల్ లో జాయిన్
చేశారు.
శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. ఈ సినిమాకు నాట్ ఏ కామన్ మేన్ అనే టైటిల్
పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. విశాల్ పై ఓ యాక్షన్ సీన్
తీస్తున్నారు. ఇందులో భాగంగా విలన్, హీరోను బలంగా వెనక్కి నెట్టారు. ఈ క్రమంలో విశాల్ నిజంగానే
బలంగా వెనక్కి వెళ్లి ఓ ఇనుప వస్తువును ఢీకొన్నాడు. విశాల్ కు రోప్ కట్టి కాస్త నెమ్మదిగా లాగాల్సిన
టెక్నీషియన్స్ కాస్త బలంగా లాగడంతో విశాల్ వెన్నెముకకు గాయమైంది.
విశాల్ కు దెబ్బ తగలడం ఇదే తొలిసారి కాదు. ఇదే సినిమా షూటింగ్ లో గతంలో ఓసారి గాయాల
పాలయ్యాడు విశాల్. తలకు, కంటికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈసారి మాత్రం వెన్నెముకకు కాస్త
గట్టిగానే దెబ్బ తగిలింది.