ఫ్యాన్స్ కు సారీ చెప్పిన వెంకటేష్

తమ సినిమాల్ని ఓటీటీకి ఇవ్వడానికి హీరోలెవ్వరూ ఇష్టపడరు. కాస్త లేట్ అయినా థియేటర్లలోకే వద్దామని వెయిట్ చేస్తున్నారు. అలాంటిది వెంకటేష్ ఏకంగా ఒకేసారి 2 సినిమాల్ని ఓటీటీకి ఇచ్చేశాడు. అతడు నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమాలు రెండూ ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో వెంకీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. మరికొంతమంది వీరాభిమానులైతే సోషల్ మీడియాలో వెంకటేష్ పై ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. ఇక ఇండస్ట్రీ పెద్దలు కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. థియేటర్ల సమస్యను పరిష్కరించాల్సిన […]

Advertisement
Update:2021-07-17 14:55 IST

తమ సినిమాల్ని ఓటీటీకి ఇవ్వడానికి హీరోలెవ్వరూ ఇష్టపడరు. కాస్త లేట్ అయినా థియేటర్లలోకే
వద్దామని వెయిట్ చేస్తున్నారు. అలాంటిది వెంకటేష్ ఏకంగా ఒకేసారి 2 సినిమాల్ని ఓటీటీకి ఇచ్చేశాడు.
అతడు నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమాలు రెండూ ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్నాయి.

దీంతో వెంకీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. మరికొంతమంది వీరాభిమానులైతే సోషల్ మీడియాలో వెంకటేష్
పై ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. ఇక ఇండస్ట్రీ పెద్దలు కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. థియేటర్ల
సమస్యను పరిష్కరించాల్సిన సురేష్ బాబు, ఇలా నారప్పను ఓటీటీకి ఇచ్చేయడాన్ని విమర్శించారు.

ఈ మొత్తం వ్యవహారంపై వెంకటేష్ స్పందించాడు. నారప్ప ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్
అయిన వెంకీ, తన అభిమానులకు సారీ చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య నారప్ప సినిమాను
ఓటీటీకి ఇచ్చేయాల్సి వచ్చిందని, అభిమానులంతా క్షమించాలని కోరాడు. నారప్ప సినిమా థియేటర్లలో
రిలీజవ్వడం తనకు కూడా ఇష్టంలేదని, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు.. లైఫ్ మనకు ఏది
అందిస్తే దాన్ని స్వీకరించాలంటూ వేదాంతం వల్లించాడు వెంకీ.

Tags:    
Advertisement

Similar News