త్రివిక్రమ్-మహేష్ మూవీ అప్ డేట్

అల వైకుంఠపురములో రిలీజైన దగ్గర్నుంచి ఖాళీ అయిపోయాడు త్రివిక్రమ్. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నప్పటికీ, ఆఖరి నిమిషంలో ఎన్టీఆర్ సినిమాను కాస్త పక్కనపెట్టి.. మహేష్ మూవీని ముందుకు తెచ్చారు. అయితే మహేష్ తో మూవీ లాక్ అయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు త్రివిక్రమ్ సెట్స్ పైకి వచ్చే పరిస్థితి లేదనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ చేతిలో ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా ఉంది. అది పూర్తయితే తప్ప త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయలేడు. […]

Advertisement
Update:2021-07-17 14:46 IST

అల వైకుంఠపురములో రిలీజైన దగ్గర్నుంచి ఖాళీ అయిపోయాడు త్రివిక్రమ్. ఆ సినిమా సక్సెస్ తర్వాత
ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నప్పటికీ, ఆఖరి నిమిషంలో ఎన్టీఆర్ సినిమాను కాస్త పక్కనపెట్టి.. మహేష్
మూవీని ముందుకు తెచ్చారు. అయితే మహేష్ తో మూవీ లాక్ అయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు త్రివిక్రమ్
సెట్స్ పైకి వచ్చే పరిస్థితి లేదనే విషయం అందరికీ తెలిసిందే.

మహేష్ చేతిలో ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా ఉంది. అది పూర్తయితే తప్ప త్రివిక్రమ్ సినిమాను
స్టార్ట్ చేయలేడు. అలా దాదాపు రెండేళ్లుగా త్రివిక్రమ్ ఖాళీ అయిపోయాడు. అయితే ఉన్నంతలో త్రివిక్రమ్
కు ఊరటనిచ్చే అంశం ఒకే ఒక్కటి.

సర్కారువారి పాట సినిమా సెట్స్ పై ఉంటుండగానే త్రివిక్రమ్ సినిమాకు కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ
అవుతున్నాడు మహేష్. సర్కారువారి పాట సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్
చేస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొస్తాడట
మహేష్.

Tags:    
Advertisement

Similar News