మహిళలు రాజకీయాలు చేయొద్దా? కేటీఆర్ స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
మహిళలు రాజకీయాలు చేయొద్దా అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇటీవల తనపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు. పక్క పార్టీల నుంచి మహిళా ప్రజాప్రతినిధులను తెచ్చుకొని మంత్రులను చేశారు. ఆ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కనీసం మహిళలకు ఓ కుర్చీ అయినా వేస్తారా? ’ అంటూ షర్మిల మండిపడ్డారు. మహిళలు వారం వారం వ్రతం చేసినట్టుగానే షర్మిల దీక్షలు చేస్తున్నారంటూ […]
మహిళలు రాజకీయాలు చేయొద్దా అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇటీవల తనపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు. పక్క పార్టీల నుంచి మహిళా ప్రజాప్రతినిధులను తెచ్చుకొని మంత్రులను చేశారు. ఆ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కనీసం మహిళలకు ఓ కుర్చీ అయినా వేస్తారా? ’ అంటూ షర్మిల మండిపడ్డారు.
మహిళలు వారం వారం వ్రతం చేసినట్టుగానే షర్మిల దీక్షలు చేస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. మహిళలు వంటింట్లో ఉంటూ వ్రతాలు మాత్రమే చేసుకోవాలా? రాజకీయాలు చేయొద్దా? ఇదేనా వారు మహిళలకు ఇచ్చే గౌరవం అని షర్మిల ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు.’
తెలంగాణకు దివంగత నేత వైఎస్సార్ వ్యతిరేకం కాదని ఆమె పేర్కొన్నారు. యూపీఏ- 1 మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని రాజశేఖర్‌రెడ్డే చేర్చారని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. తాను ఏపీ సీఎం జగన్‌తో విభేదించి పార్టీ పెట్టానని అంటున్నారని .. ఇదంతా తప్పుడు ప్రచారమని షర్మిల కొట్టిపారేశారు.
ఆడపడుచులు పుట్టింటితో గొడవలు పెట్టుకుంటే పార్టీలు పెడతారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే తాను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయనను కలుసుకొనేందుకు అవకాశం ఉండేదని.. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని ఆమె వ్యాఖ్యానించారు.
తాను తెలంగాణలో పుట్టి పెరిగానని ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనకు తెలుసని చెప్పారు. ‘ప్రతి ఒక్కరికి ఓ మతం ఉంటుంది. ఈ మతం ఇంటివరకే పరిమితం. రాజకీయాల్లోకి వచ్చిన వెంబడే నాకు మతాన్ని ఆపాదించడం దురదృష్టకరం’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
‘ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. ఇక్కడ పాలన బాగుంటుందని భావించాను. కానీ ఆ పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్య పోలేదు. పేదరికం పోలేదు. ప్రస్తుతం ఇక్కడ కొత్త రాజకీయపార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది, అందుకే నేను రాజకీయపార్టీని స్థాపించాను’ అంటూ షర్మిల పేర్కొన్నారు.