ఆ సినిమా టైటిల్ మారిందా?
నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ-2 సినిమాకు సంబంధించి ఓ కొత్త పుకారు ఊపందుకుంది. ఈ సినిమాకు టైటిల్ మారుస్తారనే ప్రచారం సాగుతోంది. దైవం మనుష్య రూపేనా అనే టైటిల్ ను పెట్టొచ్చంటూ కథనాలు వస్తున్నాయి. వీటిని సినిమా యూనిట్ ఖండించింది. కార్తికేయ-2 టైటిల్ ను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఫిలింఛాంబర్ లో టైటిల్ కూడా రిజిస్టర్ అయింది. ఎలాంటి సమస్యల్లేవ్. ఇలాంటి టైమ్ లో టైటిల్ మార్పు అంటూ […]
నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ-2 సినిమాకు సంబంధించి ఓ కొత్త పుకారు ఊపందుకుంది. ఈ
సినిమాకు టైటిల్ మారుస్తారనే ప్రచారం సాగుతోంది. దైవం మనుష్య రూపేనా అనే టైటిల్ ను
పెట్టొచ్చంటూ కథనాలు వస్తున్నాయి. వీటిని సినిమా యూనిట్ ఖండించింది.
కార్తికేయ-2 టైటిల్ ను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఫిలింఛాంబర్ లో టైటిల్ కూడా రిజిస్టర్ అయింది. ఎలాంటి సమస్యల్లేవ్. ఇలాంటి టైమ్ లో టైటిల్ మార్పు అంటూ ప్రచారం స్టార్ట్ అవ్వడంతో నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా వెంటనే అలెర్ట్ అయింది. టైటిల్ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది.
చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది కార్తికేయ-2. అనుపమ
పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా
పేరుతెచ్చుకుంది. రీసెంట్ గా సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది.