నాగశౌర్య నుంచి మరో సినిమా సెట్స్ పైకి
నాగశౌర్య, అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొత్త షెడ్యూల్ తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో నాగశౌర్య, హీరోయిన్ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే, అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని […]
నాగశౌర్య, అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ
రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా
చిత్రీకరణకు సంబంధించిన కొత్త షెడ్యూల్ తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
హీరో నాగశౌర్య, హీరోయిన్ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక
సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే,
అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని బట్టి సినిమా అవుట్ పుట్
అద్భుతంగా వస్తుందని తెలుస్తోంది.
శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ
టైటిల్ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు.
హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండబోతోంది. మహతి
స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ ఛాయగ్రాహకులు.