ఓటీటీ వైపు "ఎనిమి" చూపు

విశాల్ సినిమాలన్నీ తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. విశాల్ అలా ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా రిలీజ్ చేయడం కష్టమైన విషయమే. తమిళనాడు సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా లేవు. అటు ఎగ్జిబిటర్లు కూడా వినాయకచవితి వరకు థియేటర్లు తెరిచేది లేదని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలో విశాల్ తన కొత్త సినిమాను ఓటీటీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు. విశాల్, ఆర్య హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎనిమి. ఆనంద్ […]

Advertisement
Update:2021-07-14 03:25 IST

విశాల్ సినిమాలన్నీ తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. విశాల్ అలా ప్లాన్
చేస్తుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా రిలీజ్ చేయడం కష్టమైన విషయమే. తమిళనాడు
సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా లేవు. అటు ఎగ్జిబిటర్లు కూడా
వినాయకచవితి వరకు థియేటర్లు తెరిచేది లేదని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలో విశాల్ తన కొత్త
సినిమాను ఓటీటీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు.

విశాల్, ఆర్య హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎనిమి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. మినీ స్టుడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో
ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ సినిమాను డైరక్ట్
ఓటీటీ రిలీజ్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.

నిజానికి గతంలోనే విశాల్ నటించిన ఓ సినిమా ఓటీటీకి రావాల్సింది. కానీ ఆఖరి నిమిషంలో థియేటర్లు
తెరుచుకోవడంతో ఆ ప్లాన్స్ ఆగిపోయాయి. ఈసారి మాత్రం విశాల్ కు థియేట్రికల్ రిలీజ్ కష్టం అవ్వొచ్చని
భావిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News