జీహెచ్​ఎంసీ ఉద్యోగులకు జీతాలు దండగ.. హైకోర్టు సీరియస్​

హైదరాబాద్​లో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక వర్షం వచ్చినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన రోడ్లు మినహా.. స్లమ్​ ఏరియాలో రోడ్లు చాలా అసౌకర్యంగా ఉంటాయి. గత ఏడాది వర్షంతో హైదరాబాద్​ ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వృద్ధ జంట హైదరాబాద్​లోని గుంతలుపడ్డ రోడ్లను పూడ్చుకుంటూ వెళ్లారు. గంగాధర్​ తిలక్​, వెంకటేశ్వరీ అనే వృద్ధ దంపతులు .. హైదరాబాద్​ రోడ్ల మీద పర్యటించి .. ఎక్కడైనా గుంతలు కనిపిస్తే […]

Advertisement
Update:2021-07-14 15:02 IST

హైదరాబాద్​లో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక వర్షం వచ్చినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన రోడ్లు మినహా.. స్లమ్​ ఏరియాలో రోడ్లు చాలా అసౌకర్యంగా ఉంటాయి. గత ఏడాది వర్షంతో హైదరాబాద్​ ప్రజలు అతలాకుతలం అయ్యారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ వృద్ధ జంట హైదరాబాద్​లోని గుంతలుపడ్డ రోడ్లను పూడ్చుకుంటూ వెళ్లారు. గంగాధర్​ తిలక్​, వెంకటేశ్వరీ అనే వృద్ధ దంపతులు .. హైదరాబాద్​ రోడ్ల మీద పర్యటించి .. ఎక్కడైనా గుంతలు కనిపిస్తే వాటిని సొంత ఖర్చులతో పూడ్చుతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వృద్ధ దంపతులను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు.

బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ వృద్ధ దంపతులు రోడ్ల మీద గుంతలు పూడ్చడం జీహెచ్​ఎంసీకి సిగ్గుచేటు. వారికి జీతాలు కూడా దండగే. వారికిచ్చే వేతనాలను ఈ వృద్ధ దంపతులకు ఇచ్చేయండి’ అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు ఈ పిటిషన్​పై ప్రభుత్వ తరఫు లాయర్​ వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్ లో రోడ్లు ఎంతో బాగున్నాయంటూ కోర్టుకు చెప్పారు. దీంతో హైకోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీలు చేయించమంటారా? అంటూ కోర్టు మండిపడింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Tags:    
Advertisement

Similar News