ఏజెంట్ యుద్ధం మొదలైంది
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో హై బడ్జెట్ మరియు అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. ఈ సినిమాలో అఖిల్ ఇంతవరకూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అఖిల్ ఈ చిత్రంలో ఏజెంట్‌గా సరికొత్త రూపంలో కనిపించనున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి నిన్న జిమ్‌లో అఖిల్ బ్యాక్ పోజ్ విడుదల చేయగా, […]
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో
హై బడ్జెట్ మరియు అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'.
ఈ సినిమాలో అఖిల్ ఇంతవరకూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్
ఈ రోజు ప్రారంభమైంది.
అఖిల్ ఈ చిత్రంలో ఏజెంట్‌గా సరికొత్త రూపంలో కనిపించనున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి నిన్న
జిమ్‌లో అఖిల్ బ్యాక్ పోజ్ విడుదల చేయగా, ఈ రోజు ఈ చిత్రం యొక్క కొత్త పోస్టర్ ను విడుదలచేశారు
మేకర్స్. కండలు తిరిగిన దేహంతో స్లీవ్‌లెస్ టీ షెర్ట్‌ని పైకి ఎత్తి ఉన్నఈ పోస్టర్ ఎట్రాక్టివ్ గా ఉంది. అఖిల్
తన గన్‌ని ప్యాంట్‌లో పెట్టుకోవడం చూడొచ్చు.
సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో 'కిక్', 'రేసుగుర్రం' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్
వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందంటున్నారు. స్పై థ్రిల్లర్‌గా
తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.