ఫైనల్ షెడ్యూల్ లో నాగశౌర్య సినిమా
ప్రస్తుతం నాగశౌర్య చేతిలో 2 సినిమాలున్నాయి. వాటి పేర్లు వరుడు కావలెను, లక్ష్య. వీటిలో వరుడు కావలెను సినిమాను ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకొచ్చాడు శౌర్య. దాన్ని ఫైనల్ షెడ్యూల్ లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు లక్ష్య మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కూడా ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో వస్తున్న సినిమా ‘లక్ష్య’. కెరీర్ లో నాగశౌర్యకు ఇది 20వ సినిమా. ఈ […]
ప్రస్తుతం నాగశౌర్య చేతిలో 2 సినిమాలున్నాయి. వాటి పేర్లు వరుడు కావలెను, లక్ష్య. వీటిలో వరుడు
కావలెను సినిమాను ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకొచ్చాడు శౌర్య. దాన్ని ఫైనల్ షెడ్యూల్ లోకి తీసుకొచ్చాడు.
ఇప్పుడు లక్ష్య మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కూడా ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది.
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో వస్తున్న సినిమా
‘లక్ష్య’. కెరీర్ లో నాగశౌర్యకు ఇది 20వ సినిమా. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని
సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్,
పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ
హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్
నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో
పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ఫైనల్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే
రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు.