ఉత్తరాంధ్ర నుంచి మరో పాటొచ్చింది
ఆమధ్య అంతా సినిమాల్లో తెలంగాణ పాటలు పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రాయలసీమ పాటలు క్లిక్ అయ్యాయి. ఉత్తరాంధ్ర వంతు వచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన జానపదాలకు ఇప్పుడు టాలీవుడ్ లో గిరాకీ పెరిగింది. పలాస సినిమాలో నక్కిలీసు గొలుసు హిట్టవ్వడంతో అంతా శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ పై పడ్డారు. ఇందులో భాగంగా శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా ఉత్తరాంధ్ర పాట పెట్టారు. మణిశర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే […]
ఆమధ్య అంతా సినిమాల్లో తెలంగాణ పాటలు పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రాయలసీమ పాటలు క్లిక్
అయ్యాయి. ఉత్తరాంధ్ర వంతు వచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన జానపదాలకు ఇప్పుడు టాలీవుడ్ లో
గిరాకీ పెరిగింది. పలాస సినిమాలో నక్కిలీసు గొలుసు హిట్టవ్వడంతో అంతా శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ పై
పడ్డారు. ఇందులో భాగంగా శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా ఉత్తరాంధ్ర పాట పెట్టారు.
మణిశర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే పాటను మెగాస్టార్ చిరంజీవి
విడుదల చేశారు. ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వడంలో మణిశర్మది ఓ ప్రత్యేకమైన శైలి, అందుకు తగ్గట్లుగానే
ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మందులోడా అంటూ సాగే మాస్ తీన్ మార్ లిరిక్స్ అందించారు. దీంతో
ఇప్పుడు ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ పాట లిరికల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్ కి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ
చిత్రాన్ని భలేమంచిరోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి బ్లాక్‌బస్టర్ హ్యట్రిక్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు
సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.