ఓటీటీ నుంచి వెనక్కి వచ్చిన నారప్ప
వెంకటేష్ హీరోగా నటిస్తున్న దృశ్యం-2, నారప్ప సినిమాలు రెండింటినీ ఓటీటీకి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటిలో నారప్ప సినిమా వెనక్కి తగ్గింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్న వేళ, నారప్ప సినిమాను సినిమా హాళ్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అగ్రిమెంట్లలో మార్పుచేర్పులు చేసి, హక్కుల్ని వెనక్కి తీసుకున్నారు. నారప్ప థియేట్రికల్ రైట్స్ వెనక్కి రావడంతో, మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం […]
వెంకటేష్ హీరోగా నటిస్తున్న దృశ్యం-2, నారప్ప సినిమాలు రెండింటినీ ఓటీటీకి ఇచ్చేసిన సంగతి
తెలిసిందే. ఇప్పుడు వీటిలో నారప్ప సినిమా వెనక్కి తగ్గింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్న
వేళ, నారప్ప సినిమాను సినిమా హాళ్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా
అగ్రిమెంట్లలో మార్పుచేర్పులు చేసి, హక్కుల్ని వెనక్కి తీసుకున్నారు.
నారప్ప థియేట్రికల్ రైట్స్ వెనక్కి రావడంతో, మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా
ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్,
పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన 'నారప్ప' టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్
వచ్చింది. ఈ చిత్రం నుండి చలాకి చిన్నమ్మీ.. అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను జూలై11 ఉదయం
10గంటలకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A
సర్టిఫికెట్ పొందింది. విక్టరి వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న 'నారప్ప' సినిమాను సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను
సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ
మూవీలో నారప్ప భార్య 'సుందరమ్మ'గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.