దేవిశ్రీ ప్రసాద్ కు బన్నీ స్పెషల్ గిఫ్ట్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్‌గా ఎంత‌టి సెన్సేష‌న్‌ని క్రియేట్ చేశాయో అంద‌రికీ తెలిసిందే. ఆర్య నుంచి వీళ్ల హిట్ కాంబినేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పుష్ప సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. తమ కెరీర్ ప్రారంభం నుండి కలిసి పనిచేస్తున్న బన్నీ, డీఎస్పీల మధ్య అనుబంధం మ‌రింత బలపడింది. కాగా తన సన్నిహితులకు,స్నేహితులకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు […]

Advertisement
Update:2021-07-08 14:51 IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్‌గా ఎంత‌టి
సెన్సేష‌న్‌ని క్రియేట్ చేశాయో అంద‌రికీ తెలిసిందే. ఆర్య నుంచి వీళ్ల హిట్ కాంబినేషన్ కొనసాగుతూనే
ఉంది. ఇప్పుడు పుష్ప సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. తమ కెరీర్ ప్రారంభం నుండి కలిసి
పనిచేస్తున్న బన్నీ, డీఎస్పీల మధ్య అనుబంధం మ‌రింత బలపడింది.

కాగా తన సన్నిహితులకు,స్నేహితులకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు
అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్‌ప్రైజ్‌ను డీఎస్పీకి పంపాడు బ‌న్నీ.

బన్నీ ‘రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్’ అనే లైటింగ్ నేమ్ బోర్డ్ డిజైన్ ను ప్రత్యేకంగా తయారు చేయించి దేవికి
పంపారు. అల్లు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా తన ట్విటర్‌ ఖాతా ద్వారా
అభిమానులతో పంచుకున్నారు దేవిశ్రీ ప్రసాద్.

Tags:    
Advertisement

Similar News