రామ్ దర్శకుడితో నాగచైతన్య మూవీ

కిషోర్ తిరుమల.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. నేను శైలజ సినిమాతో దర్శకుడిగా మంచి ఇమేజ్ అందుకున్న కిషోర్, ఆ తర్వాత రామ్ తోనే ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ లాంటి సినిమాలు చేశాడు. మధ్యలో సాయితేజ్ హీరోగా చిత్రలహరి అనే సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడీ దర్శకుడు నాగచైతన్యను కలిశారు. మంచి సెన్సిటివ్ లవ్ స్టోరీ ఒకటి వినిపించాడు. ఆ కథ చైతూకు బాగా నచ్చింది. మజిలీ తర్వాత ఆ […]

Advertisement
Update:2021-07-03 13:02 IST

కిషోర్ తిరుమల.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. నేను శైలజ సినిమాతో
దర్శకుడిగా మంచి ఇమేజ్ అందుకున్న కిషోర్, ఆ తర్వాత రామ్ తోనే ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ లాంటి
సినిమాలు చేశాడు. మధ్యలో సాయితేజ్ హీరోగా చిత్రలహరి అనే సినిమా తీసి మరో హిట్ కొట్టాడు.

ఇప్పుడీ దర్శకుడు నాగచైతన్యను కలిశారు. మంచి సెన్సిటివ్ లవ్ స్టోరీ ఒకటి వినిపించాడు. ఆ కథ
చైతూకు బాగా నచ్చింది. మజిలీ తర్వాత ఆ స్థాయి ఎమోషన్స్ ఉన్న స్టోరీ అవ్వడంతో వెంటనే అందులో
నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇతర వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. అటు కిషోర్
తిరుమల, శర్వానంద్ తో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు
పూర్తయిన తర్వాత చైతూ-కిషోర్ కలిసి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News