భార్యకు విడాకులిచ్చిన అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ దంపతులు విడిపోయారు. తామిద్దరం విడిపోయిన విషయాన్ని అమీర్, కిరణ్ రావు జాయింట్ గా ప్రకటించారు. 15 ఏళ్ల వీళ్ల వైవాహిక బంధం వీగిపోయింది. విడాకులు తీసుకుంటున్న విషయాన్ని అమీర్-కిరణ్ స్వయంగా ఓ స్టేట్ మెంట్ ద్వారా ప్రకటించారు. కానీ 15 ఏళ్ల పాటు కాపురం చేసిన ఈ జంట ఎందుకు విడిపోతుందనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. గతంలో హృతిక్ రోషన్ తన భార్య నుంచి విడిపోయినప్పుడు చాలా లీకులొచ్చాయి. వాటిని నిజం చేస్తూ కొన్నాళ్లకు […]
అమీర్ ఖాన్ దంపతులు విడిపోయారు. తామిద్దరం విడిపోయిన విషయాన్ని అమీర్, కిరణ్ రావు జాయింట్
గా ప్రకటించారు. 15 ఏళ్ల వీళ్ల వైవాహిక బంధం వీగిపోయింది. విడాకులు తీసుకుంటున్న విషయాన్ని
అమీర్-కిరణ్ స్వయంగా ఓ స్టేట్ మెంట్ ద్వారా ప్రకటించారు. కానీ 15 ఏళ్ల పాటు కాపురం చేసిన ఈ జంట
ఎందుకు విడిపోతుందనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.
గతంలో హృతిక్ రోషన్ తన భార్య నుంచి విడిపోయినప్పుడు చాలా లీకులొచ్చాయి. వాటిని నిజం చేస్తూ
కొన్నాళ్లకు హృతిక్-సుజేన్ విడిపోయారు. కానీ అమీర్-కిరణ్ మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు ఎక్కడా
వార్తలు రాలేదు. కనీసం లీకులు కూడా జరగలేదు. సడెన్ గా వీళ్లిద్దరూ ఇలా కలిసి విడాకుల మేటర్
ప్రకటించేసరికి ఆశ్చర్యపోవడం బాలీవుడ్ వంతయింది.
తామిద్దరం కొన్నాళ్లుగా కలిసి ఉండడం లేదనే విషయాన్ని అమీర్, కిరణ్ రావు స్వయంగా ప్రకటిస్తే తప్ప
లోకానికి తెలియలేదు. ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని, అందుకే సామర్యంగానే
విడిపోతున్నట్టు ఈ జంట పేర్కొంది. భార్యాభర్తలుగా విడిపోయినా, కొడుకు ఆజాద్ కోసం తల్లిదండ్రులుగా
తాము ఎప్పుడూ కలిసే ఉంటామని వీళ్లు పేర్కొన్నారు.