6వ తేదీ నుంచి ఆచార్య షూట్

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వచ్చాయి. 6వ తేదీ నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది. హైదరాబాద్ లోని కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లోనే ఈ సినిమా షెడ్యూల్ మొదలవుతుంది. ఫైనల్ షెడ్యూల్ లో భాగంగా చిరంజీవిపై కొన్ని సన్నివేశాలు, చరణ్-పూజాహెగ్డేపై ఓ పాట తీయబోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే హైదరాబాద్ లోనే ఉంది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో […]

Advertisement
Update:2021-07-02 15:01 IST

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వచ్చాయి.
6వ తేదీ నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది. హైదరాబాద్ లోని కోకాపేట్ లో వేసిన
ప్రత్యేకమైన సెట్ లోనే ఈ సినిమా షెడ్యూల్ మొదలవుతుంది.

ఫైనల్ షెడ్యూల్ లో భాగంగా చిరంజీవిపై కొన్ని సన్నివేశాలు, చరణ్-పూజాహెగ్డేపై ఓ పాట
తీయబోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే హైదరాబాద్ లోనే ఉంది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ సినిమా
షూటింగ్ లో పాల్గొంటోంది. ఆచార్యకు సంబంధించి పూజా హెగ్డే 4 రోజులు కాల్షీట్లు ఇచ్చింది.

12 నుంచి 15 రోజుల గ్యాప్ లో ఆచార్య షూటింగ్ ను పూర్తిచేయబోతున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత
విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఒకవేళ రిలీజ్ డేట్ పై స్పష్టత రాకపోతే.. సెకెండ్ సింగిల్
విడుదల తేదీనైనా ప్రకటిస్తారు.

సోనూ సూద్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా
నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News