నారప్ప రిలీజ్ కు రెడీ అయింది
విక్టరి వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నారప్ప`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన హిట్ సినిమాకు రీమేక్ ఇది. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య `సుందరమ్మ`గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన […]
విక్టరి వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నారప్ప'. సురేష్ బాబు,
కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన హిట్ సినిమాకు
రీమేక్ ఇది.
విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ
మూవీలో నారప్ప భార్య 'సుందరమ్మ'గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్,
పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన 'నారప్ప' టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్
వచ్చింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి
U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో విక్టరి వెంకటేష్
కనిపించనున్నారు.
సెన్సార్ అయితే అయింది కానీ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేక ఓటీటీలో నేరుగా రిలీజ్
చేస్తారనే అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే
ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే దృశ్యం-2 సినిమాను ఓటీటీకి ఇచ్చేశారు. ఇప్పుడు నారప్ప కూడా
ఓటీటీకి వెళ్తే, వెంకటేష్ అభిమానులకు అంతకంటే నిరాశ ఉండదు.