భీష్మ కాంబో మళ్లీ వస్తోంది
వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ ను మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది భీష్మ సినిమా. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నితిన్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. నితిన్ కోసం మరో స్టోరీ రెడీ చేశాడట వెంకీ. త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది. భీష్మ సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకీ ఇటివలే వరుణ్ తేజ్ కి ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని సమాచారం. […]
వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ ను మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది భీష్మ సినిమా. వెంకీ కుడుముల
దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నితిన్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ
కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. నితిన్ కోసం మరో స్టోరీ రెడీ చేశాడట వెంకీ. త్వరలోనే అఫీషియల్ స్టేట్
మెంట్ రానుంది.
భీష్మ సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకీ ఇటివలే వరుణ్ తేజ్ కి ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్
అందుకున్నాడని సమాచారం. అయితే వెంకీ నెక్స్ట్ సినిమా, వరుణ్ తేజ్ తో ఫిక్స్ అనుకునే లోపు మళ్ళీ
నితిన్-వెంకీ కాంబో తెరపైకి వచ్చింది. మరి వెంకీ ముందు వరుణ్ తేజ్ తో సినిమా చేసి ఆ తర్వాత నితిన్
సినిమా చేస్తాడా ? లేదా ముందు నితిన్ తో సినిమా చేసిన తర్వాత వరుణ్ తేజ్ సినిమాకి షిఫ్ట్ అవుతాడా
అనేది తెలియాల్సి ఉంది.
అటు నితిన్ కూడా ఇప్పటివరకు తన కొత్త సినిమా ప్రకటించలేదు. మాస్ట్రో మూవీ పూర్తిచేసిన ఈ హీరో
లెక్కప్రకారం.. పవర్ పేట సినిమాను స్టార్ట్ చేయాలి. కానీ ఆ మూవీని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
ఈమధ్య వక్కంతం వంశీతో సినిమా అనే ప్రచారం జరిగింది. అంతలోనే వెంకీ కుడుముల పేరు
తెరపైకొచ్చింది.