మసకబారలేదంటున్న నరేష్

నిన్న తన ప్యానెల్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు నటుడు ప్రకాష్ రాజ్. తనపై వచ్చిన నాన్-లోకల్ విమర్శల్ని గట్టిగానే తిప్పికొట్టాడు. అదే టైమ్ లో నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మా అసోసియేషన్ కొన్నాళ్లుగా మసకబారిందన్నారు నాగబాబు. ఈ కామెంట్స్ ను ఘాటుగా తిప్పికొట్టారు సీనియర్ నటుడు నరేష్. “అసోసియేషన్ లో ఎంతో అనుభవం ఉన్న నా మిత్రుడు నాగబాబు […]

Advertisement
Update:2021-06-26 13:34 IST

నిన్న తన ప్యానెల్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు నటుడు ప్రకాష్ రాజ్. తనపై వచ్చిన నాన్-లోకల్
విమర్శల్ని గట్టిగానే తిప్పికొట్టాడు. అదే టైమ్ లో నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మా అసోసియేషన్ కొన్నాళ్లుగా
మసకబారిందన్నారు నాగబాబు. ఈ కామెంట్స్ ను ఘాటుగా తిప్పికొట్టారు సీనియర్ నటుడు నరేష్.

“అసోసియేషన్ లో ఎంతో అనుభవం ఉన్న నా మిత్రుడు నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడం చాలా బాధ
కలిగించింది. అసోసియేషన్ కోసం మేం చేసిన కార్యక్రమాల్ని చిరంజీవి నాగబాబుకు చెప్పగా
ప్రశంసించారు. అంతేకాదు, అమెరికాలో కూడా అసోసియేషన్ బాగా పనిచేస్తోందన్నారు. ఇప్పుడేమో
మసకబారిందంటున్నారు.”

ఇలా నాగబాబు వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు నరేష్. ప్రకాష్ రాజ్ చెప్పిన మాటనే ఈ సందర్భంగా మరోసారి
రిపీట్ చేశారు నరేష్. ఎన్నికల సందర్భంగా గ్రూపులు లేవని, అంతా ఒకటేనని అన్నారు. పదవుల కోసం
ఆశపడడం లేదని… మా పనుల్ని తక్కువ చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారని ప్రశ్నించారు. ఒక
విజన్ తో వచ్చిన తమ ప్యానెల్, హింసకు లొంగేది లేదని అన్నారు.

Tags:    
Advertisement

Similar News