దుబాయ్ వెళ్లబోతున్న ఖిలాడీ

లాక్ డౌన్ ఎత్తేయడంతో రవితేజ రెట్టించిన ఉత్సాహంతో సెట్స్ పైకి వస్తున్నాడు. ఇందులో భాగంగా ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఖిలాడీ సినిమాను కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మాస్ రాజా.. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి దుబాయ్ షెడ్యూల్ కూడా లాక్ చేశాడు. ఖిలాడీ సినిమాకు సంబంధించి వచ్చేనెల దుబాయ్ వెళ్లబోతోంది యూనిట్. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని సాంగ్స్ పూర్తిచేయబోతున్నారు. […]

Advertisement
Update:2021-06-26 13:25 IST

లాక్ డౌన్ ఎత్తేయడంతో రవితేజ రెట్టించిన ఉత్సాహంతో సెట్స్ పైకి వస్తున్నాడు. ఇందులో భాగంగా ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఖిలాడీ సినిమాను కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మాస్ రాజా.. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి దుబాయ్ షెడ్యూల్ కూడా లాక్ చేశాడు.

ఖిలాడీ సినిమాకు సంబంధించి వచ్చేనెల దుబాయ్ వెళ్లబోతోంది యూనిట్. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని సాంగ్స్ పూర్తిచేయబోతున్నారు. అలా దుబాయ్ షెడ్యూల్ తో సినిమాకు ప్యాకప్ చెప్పేయాలని అనుకుంటున్నారు. ఆ వెంటనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు.

క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొత్త దర్శకుడితో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ.

Tags:    
Advertisement

Similar News