నాగార్జున ఓటీటీ ఆలోచనలు

నాగార్జునపై కొత్త పుకారు ఊపందుకుంది. ఈసారి వచ్చిన పుకార్లు ఆయన సినిమాలకు సంబంధించినవి కావు. ఇవి ఇంకాస్త వెరైటీ. ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని నటుడిగా కొనసాగిన నాగార్జున, ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారట. మంచి కంటెంట్ దొరికితే ఓటీటీలో కూడా అడుగు పెడతారట. నాగార్జున ఆల్రెడీ 60 క్రాస్ చేశారు. టాలీవుడ్ మన్మథుడు అనే ఇమేజ్ అయితే ఉంది కానీ, ఇప్పుడు ఆయన నిజంగా రొమాంటిక్ సినిమాలు చేస్తే ఎవ్వరూ చూడరు. దీనికి క్లాసిక్ […]

Advertisement
Update:2021-06-23 12:45 IST

నాగార్జునపై కొత్త పుకారు ఊపందుకుంది. ఈసారి వచ్చిన పుకార్లు ఆయన సినిమాలకు సంబంధించినవి
కావు. ఇవి ఇంకాస్త వెరైటీ. ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని నటుడిగా కొనసాగిన నాగార్జున, ఇప్పుడు
ఓటీటీ వైపు అడుగులేస్తున్నారట. మంచి కంటెంట్ దొరికితే ఓటీటీలో కూడా అడుగు పెడతారట.

నాగార్జున ఆల్రెడీ 60 క్రాస్ చేశారు. టాలీవుడ్ మన్మథుడు అనే ఇమేజ్ అయితే ఉంది కానీ, ఇప్పుడు
ఆయన నిజంగా రొమాంటిక్ సినిమాలు చేస్తే ఎవ్వరూ చూడరు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన్మథుడు-2.
అలా అని యాక్షన్ సినిమాలు చేసిన చూడరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైల్డ్ డాగ్.

సరిగ్గా ఇక్కడే ఆలోచనలో పడ్డారు నాగార్జున. అటు యాక్షన్ కాకుండా, ఇటు రొమాన్స్ లేకుండా మంచి
కంటెంట్ ఉన్న కథలు చేయాలనుకుంటున్నారట నాగ్. అలా చేయాలంటే సిల్వర్ స్క్రీన్ పై కుదరదు.
ఓటీటీలో ప్రయత్నించాల్సిందే. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారట కింగ్.

Tags:    
Advertisement

Similar News