లైగర్ పై క్లారిటీ ఇచ్చిన రౌడీ

“విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారంట.” 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది. ఓ ఓటీటీ సంస్థ పూరి జగన్నాధ్ తో చర్చలు జరుపుతోందని.. 200 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ పుకార్లన్నింటినీ విజయ్ దేవరకొండ తనదైన స్టయిల్ లో తిప్పికొట్టాడు. తన సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. 200 కోట్లు అంటే చాలా తక్కువని, థియేటర్లలో ఇంతకంటే ఎక్కువ […]

Advertisement
Update:2021-06-22 13:59 IST

“విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారంట.” 2 రోజులుగా
జరుగుతున్న ప్రచారం ఇది. ఓ ఓటీటీ సంస్థ పూరి జగన్నాధ్ తో చర్చలు జరుపుతోందని.. 200 కోట్ల
రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ పుకార్లన్నింటినీ విజయ్
దేవరకొండ తనదైన స్టయిల్ లో తిప్పికొట్టాడు.

తన సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. 200 కోట్లు అంటే
చాలా తక్కువని, థియేటర్లలో ఇంతకంటే ఎక్కువ మొత్తమే తను సంపాదిస్తానంటూ ట్వీట్ పెట్టాడు
దేవరకొండ. దీంతో లైగర్ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అనే పుకార్లకు చెక్ పడినట్టయింది.

ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన ‘లైగర్’ త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి
వెళ్లేందుకు రెడీ అవుతుంది. సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. పూరి జగన్నాథ్
డైరెక్షన్ లో స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో
నటిస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

Tags:    
Advertisement

Similar News