కేజీఎఫ్ హీరో సరసన మిల్కీబ్యూటీ

మిల్కీబ్యూటీ తమన్న మరో గోల్డెన్ ఛాన్స్ అందుకోబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేజీఎఫ్ హీరో యష్ సరసన ఆమె నటించబోతోంది. కన్నడలో ఆమెకు స్టార్ డమ్ తెచ్చే సినిమా ఇదే కావొచ్చు. దర్శకుడు నర్తన్, ఓ మంచి మాస్ కథతో యష్ ను ఒప్పించాడు. ఇతడు ప్రశాంత్ నీల్ శిష్యుడే. నర్తన్ చెప్పిన స్టోరీలైన్ కు యష్ ఓకే చెప్పాడు. కేజీఎఫ్-2 థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో తమన్నను హీరోయిన్ గా […]

Advertisement
Update:2021-06-20 14:05 IST

మిల్కీబ్యూటీ తమన్న మరో గోల్డెన్ ఛాన్స్ అందుకోబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేజీఎఫ్ హీరో
యష్ సరసన ఆమె నటించబోతోంది. కన్నడలో ఆమెకు స్టార్ డమ్ తెచ్చే సినిమా ఇదే కావొచ్చు.

దర్శకుడు నర్తన్, ఓ మంచి మాస్ కథతో యష్ ను ఒప్పించాడు. ఇతడు ప్రశాంత్ నీల్ శిష్యుడే. నర్తన్
చెప్పిన స్టోరీలైన్ కు యష్ ఓకే చెప్పాడు. కేజీఎఫ్-2 థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈ సినిమా స్టార్ట్
అవుతుంది. ఇందులో తమన్నను హీరోయిన్ గా తీసుకున్నారట.

యష్ సరసన నటించడం తమన్నకు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. కేజీఎఫ్ లో ఆమె ఓ ఐటెంసాంగ్ చేసింది. ఆ
టైమ్ లో తమన్న హీరోయిన్ గా సినిమా చేస్తానని యష్ మాటిచ్చాడట. అదిప్పుడు ఇలా కార్యరూపం
దాలుస్తోంది.

తెలుగులో తమన్న బిజీగా ఉంది. అటు ఓటీటీలో కూడా నటిస్తోంది. జెమినీలో కూడా ఓ కార్యక్రమం
చేయడానికి ఒప్పుకుంది. ఇప్పుడు కన్నడనాట కూడా తన హవా చూపించబోతోంది.

Tags:    
Advertisement

Similar News