ఆ ఒక్క తప్పుతో జీవితం నాశనం
పూరి జగన్నాధ్ మరోసారి మెరిశాడు. పూరి మ్యూజింగ్స్ తో విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ దర్శకుడు, ఈసారి మన కోసం లైఫ్ ఏంథమ్ ను తీసుకొచ్చాడు. అసలు జీవితం అంటే ఏంటి.. ఎలా బతకాలి అనే విషయాల్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు. అందులోంచి కొన్ని చకచకా చూసేద్దాం.. – ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవ్వరూ నీకోసం పుట్టలేదు. నువ్వు ఎవ్వరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీ కోసమే చేయ్. మన బతుకే […]
పూరి జగన్నాధ్ మరోసారి మెరిశాడు. పూరి మ్యూజింగ్స్ తో విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ దర్శకుడు,
ఈసారి మన కోసం లైఫ్ ఏంథమ్ ను తీసుకొచ్చాడు. అసలు జీవితం అంటే ఏంటి.. ఎలా బతకాలి అనే
విషయాల్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు. అందులోంచి కొన్ని చకచకా చూసేద్దాం..
– ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవ్వరూ నీకోసం పుట్టలేదు. నువ్వు ఎవ్వరి కోసం
పుట్టలేదు. ఏం చేసినా నీ కోసమే చేయ్. మన బతుకే మూణ్నాళ్ల ముచ్చట. దానికి 16 రోజుల పెళ్లి
ఎందుకు? మనవలు, మనవరాళ్ల వరకు బానిస బతుకెందుకు?
– పెళ్లంటే నూరేళ్ల పెంట. ఆ ఒక్క తప్పు చేస్తే, ఆ తర్వాత ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఉపయోగం లేదు.
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. కన్న కలలన్నీ కాగితం మీద రాస్కో. నీ కలలో నువ్వు ఎప్పుడూ
ఒంటరివే. అందుకే నువ్వు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కలలు తీరతాయి.
– ఎవ్వరికీ ఏ ప్రామిస్ చేయనని నీ మీద నువ్వు ఒట్టేసుకో. మతాలు, గ్రంథాలు మనకెందుకు. ఆ కుక్కలా
సరదాగా ఉండగలిగితే చాలు. నువ్వు మెడిటేషన్ చేయనక్కర్లేదు. కాస్త సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే
నవ్వుకుంటూ బతికేయొచ్చు. పనే దైవం అనుకుంటే నీకు ఏ దేవుడు అవసరం లేదు. ఇదే లైఫ్ ఏంథమ్.