ఈసారి "లవ్ స్టోరీ" రిలీజ్ పక్కా

లవ్ స్టోరీ సినిమా ఇప్పటిది కాదు, దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న ప్రాజెక్టు ఇది. అలా పడుతూ లేస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఎప్పుడు థియేటర్లు తెరిస్తే అప్పుడు లవ్ స్టోరీని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. “జులై మొదటి వారానికి పరిస్థితులు అన్ని చక్కబడతాయని సమాచారం ఉంది. ఆ వెంటనే థియేటర్స్ కి అనుమతి రానుంది. అయితే నైట్ కర్ఫ్యూ ఇంకా కొన్ని రోజులు కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూ తొలగించిన వారానికే మా […]

Advertisement
Update:2021-06-16 15:17 IST

లవ్ స్టోరీ సినిమా ఇప్పటిది కాదు, దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న ప్రాజెక్టు ఇది. అలా పడుతూ లేస్తూ
వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఎప్పుడు థియేటర్లు తెరిస్తే అప్పుడు లవ్ స్టోరీని
విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

“జులై మొదటి వారానికి పరిస్థితులు అన్ని చక్కబడతాయని సమాచారం ఉంది. ఆ వెంటనే థియేటర్స్ కి
అనుమతి రానుంది. అయితే నైట్ కర్ఫ్యూ ఇంకా కొన్ని రోజులు కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూ తొలగించిన
వారానికే మా ‘లవ్ స్టోరి’ రిలీజ్ చేయాలని భావిస్తున్నాం”

ఇలా సినిమా విడుదలపై స్పష్టమైన ప్రకటన చేశారు నిర్మాత సునీల్ నారంగ్. డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో
పేరు గడించిన ఈయన, లవ్ స్టోరీ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. శేఖర్ కమ్ముల డైరక్ట్ చేసిన ఈ
సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. పవన్ అందించిన సంగీతం ఇప్పటికే
సూపర్ హిట్టయింది.

Tags:    
Advertisement

Similar News