కొత్త దర్శకుడితో నితిన్ సినిమా
కథా రచయితలకు, మాటల రచయితలకు దర్శకులుగా అవకాశం ఇచ్చిన హీరోలున్నారు. చివరికి కెమెరామెన్లు కూడా దర్శకులయ్యారు. అయితే ఓ ఎడిటర్ దర్శకుడు కాబోతున్నాడు. స్వయంగా నితిన్ ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఆ ఎడిటర్ పేరు ఎస్ఆర్ శేఖర్. బిజినెస్ మేన్, టెంపర్, లై లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు ఎస్ఆర్ శేఖర్. గతంలో నితిన్ నటించిన పలు సినిమాలకు కూడా వర్క్ చేశాడు. ఈ ఎడిటర్ చెప్పిన లైన్ నితిన్ కు బాగా నచ్చిందట. […]
కథా రచయితలకు, మాటల రచయితలకు దర్శకులుగా అవకాశం ఇచ్చిన హీరోలున్నారు. చివరికి
కెమెరామెన్లు కూడా దర్శకులయ్యారు. అయితే ఓ ఎడిటర్ దర్శకుడు కాబోతున్నాడు. స్వయంగా నితిన్ ఆ
దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఆ ఎడిటర్ పేరు ఎస్ఆర్ శేఖర్.
బిజినెస్ మేన్, టెంపర్, లై లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు ఎస్ఆర్ శేఖర్. గతంలో నితిన్
నటించిన పలు సినిమాలకు కూడా వర్క్ చేశాడు. ఈ ఎడిటర్ చెప్పిన లైన్ నితిన్ కు బాగా నచ్చిందట.
వెంటనే అతడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిపై
అధికారిక ప్రకటన రాబోతోంది.
ఇకపై కొత్త కథలు మాత్రమే చేస్తానని, ప్రేమకథలు చేయనని నితిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చెప్పినట్టుగానే కొత్త కథలు ట్రై చేస్తున్నాడు. త్వరలోనే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా
చేయబోతున్నాడు. ఆ వెంటనే ఎస్ఆర్ శేఖర్ సినిమా మొదలవుతుంది.