నేను రెడీ అంటున్న నిఖిల్

నితిన్ ఏకంగా సెట్స్ పైకి రావడంతో నిఖిల్ కూడా రెడీ అయ్యాడు. తను కూడా త్వరలోనే సెట్స్ పైకి వస్తున్నానంటూ ప్రకటించాడు. ఈ మేరకు 2 బ్రాండ్ న్యూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. కాకపోతే ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తాడనేది మాత్రం చెప్పలేదు నిఖిల్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 18-పేజెస్, కార్తికేయ-2 సినిమాలున్నాయి. వీటిలో కార్తికేయ-2 కోసం కండలు పెంచాడు నిఖిల్. ఆల్ మోస్ట్ సిక్స్ ప్యాక్ సాధించాడు. పీపుల్ మీడియా, అభిషేక్ పిక్చర్స్ […]

Advertisement
Update:2021-06-14 15:18 IST

నితిన్ ఏకంగా సెట్స్ పైకి రావడంతో నిఖిల్ కూడా రెడీ అయ్యాడు. తను కూడా త్వరలోనే సెట్స్ పైకి వస్తున్నానంటూ ప్రకటించాడు. ఈ మేరకు 2 బ్రాండ్ న్యూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. కాకపోతే ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తాడనేది మాత్రం చెప్పలేదు నిఖిల్.

ప్రస్తుతం ఈ హీరో చేతిలో 18-పేజెస్, కార్తికేయ-2 సినిమాలున్నాయి. వీటిలో కార్తికేయ-2 కోసం కండలు పెంచాడు నిఖిల్. ఆల్ మోస్ట్ సిక్స్ ప్యాక్ సాధించాడు. పీపుల్ మీడియా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

ఇక అదే టైమ్ లో 18-పేజెస్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు నిఖిల్. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరనే హీరోయిన్.

Tags:    
Advertisement

Similar News