కరీనా కపూర్ పై భారీ ట్రోలింగ్

ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అనేది తెలుగులో చాలా ఫేమస్ సామెత. కరీనా కపూర్ విషయంలో ఇప్పుడిది ప్రాక్టికల్ గా నిజమైంది. సినిమా లేదు, పారితోషికం లేదు.. కానీ ఆమెపై ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇంతకీ మేటర్ ఏంటో చూద్దాం. రామాయణంలో సీత పాత్ర ఆధారంగా ఓ సినిమా తీయాలనేది ప్రతిపాదన. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఆ క్యారెక్టర్ లో కరీనాను తీసుకోవాలని అనుకున్నారు. దానికి ఆమె 12 […]

Advertisement
Update:2021-06-13 12:12 IST

ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అనేది తెలుగులో చాలా ఫేమస్ సామెత. కరీనా
కపూర్ విషయంలో ఇప్పుడిది ప్రాక్టికల్ గా నిజమైంది. సినిమా లేదు, పారితోషికం లేదు.. కానీ ఆమెపై
ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇంతకీ మేటర్ ఏంటో చూద్దాం.

రామాయణంలో సీత పాత్ర ఆధారంగా ఓ సినిమా తీయాలనేది ప్రతిపాదన. విజయేంద్రప్రసాద్ కథ
అందించారు. ఆ క్యారెక్టర్ లో కరీనాను తీసుకోవాలని అనుకున్నారు. దానికి ఆమె 12 కోట్ల రూపాయలు
డిమాండ్ చేసినట్టు కథనాలు వచ్చాయి. సరిగ్గా ఇక్కడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

నిజ జీవితంలో ఓ ముస్లింను పెళ్లాడిన కరీనాకు సీత పాత్ర పోషించే అర్హత లేదంటూ ఓ వర్గం వాదిస్తోంది.
మరికొందరు మాత్రం.. సీత లాంటి పవిత్రమైన పాత్ర పోషించడానికి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్
చేయడం తప్పు అంటున్నారు. నిజానికి ఆ సినిమా ఫైనలైజ్ అవ్వలేదు, కరీనా రెమ్యూనరేషన్ ఎంతనేది
కూడా సెట్ అవ్వలేదు. అంతలోనే ఆమెపై ఇలా ట్రోలింగ్ మొదలైంది.

Tags:    
Advertisement

Similar News